Wednesday, May 8, 2024

తరతరాలకు స్ఫూర్తినిచ్చేలా….

- Advertisement -
- Advertisement -
అమరవీరుల స్మారక చిహ్నం
ప్రారంభం 10 వేల విద్యుత్
దీపాలు చేతబట్టుకొని
అమరులకు నివాళులర్పించిన
సిఎం, మంత్రులు, ప్రజా ప్రతినిధులు
అమరుల కుటుంబాలకు సన్మానం, అక్కున చేర్చుకున్న సిఎం
మన తెలంగాణ/హైదరాబాద్ : తరతరాలకు స్ఫూర్తినిచ్చేలా, అమరుల త్యాగాలను నిత్యం స్మ రించుకునేలా హైదరాబాద్ నడిబొడ్డున రాష్ట్ర ప్ర భుత్వం నిర్మించిన అమరవీరుల స్మారక చి హ్నా న్ని ముఖ్యమంత్రి కెసిఆర్ గురువారం సాయం త్రం ప్రారంభించారు. మొదటగా పోలీసులు అమరవీరులకు గన్ సెల్యూట్ నిర్వహించారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేసి న సిఎం అమర జ్యోతిని ప్రారంభించారు. ఆ త రువాత అమరవీరులపై ప్రదర్శించిన లఘు చి త్న్రా సిఎం కెసిఆర్, ప్రజాప్రతినిధులు, అధికారులు తిలకించారు. అమరవీరులను సిఎం కెసిఆర్, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు స్మరించుకుంటూ 10 వేల విద్యుత్ దీపా లు చేతబట్టుకొని వారికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి అమరవీరుల కుటుంబాలు, ఎన్జీఓలు, రాష్ట్ర సాధనలో కృషి చేసిన పలు విభాగాల్లోని వ్యక్తు లు,ప్రజాప్రతినిధులు,మంత్రులుహాజరయ్యారు.
అమరవీరులకు సన్మానం

అమరులకు నివాళిగా ఆలపించిన గేయాలు ఆకట్టుకున్నాయి. ముందుగా ఎంపికచేసిన అమరు ల కుటుంబాలకు (శ్రీకాంతాచారి, పోలీసు కిష్ట య్య, వేణుగోపాల్ రెడ్డి, సిరిపురం యాదయ్య, యాదిరెడ్డి, కావలి సువర్ణ ) సిఎం శాలువా కప్పి సన్మానించారు.

750 డ్రోన్లతో, 13 రకాల థీమ్‌లతో…

అలాగే లేజర్ షోలతో పాటు 750 డ్రోన్లతో, 13 రకాల థీమ్‌లతో, 10 ఏళ్లలో రాష్ట్రం సాధించిన ప్రగతి, విజయాలను కళ్లకు కట్టినట్లుగా 15 ని మిషాల పాటు నిర్వహించిన షో అందరినీ అలరించింది. డ్రోన్‌లకు సంబంధించిన షోను విజయవంతంగా ప్రదర్శించడానికి ఢిల్లీకి చెందిన ఐఐటి స్టార్టప్ గ్రూప్‌లోని 30 మంది సభ్యులు కష్టపడ్డారు. అమరుల స్మారక కేంద్రంలో విశాలమైన సభా మందిరం, ఉద్యమ ప్రస్థాన చిత్ర ప్రదర్శన కోసం థియేటర్, ఉద్యమ ప్రస్థానాన్ని వివరించే ఫొటో గ్యాలరీ ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News