Saturday, May 4, 2024

సమాచార శాఖలో 88 పోస్టుల భర్తీకి ఆదేశాలు

- Advertisement -
- Advertisement -

జిఓ 1384 జారీ చేసిన ప్రభుత్వం

మనతెలంగాణ/హైదరాబాద్:  సమాచార పౌర సంబంధాల శాఖలో భారీ ఎత్తున పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి ప్రత్యేక చొరవతో తెలంగాణ ప్రభుత్వం జిఓను 1384 జారీ చేసింది. ఈ జిఓ ద్వారా సమాచార పౌర సంబంధాల శాఖలో ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన ఈ 88 పోస్టులను భర్తీ చేయనున్నారు. తెలంగాణలోని 33 జిల్లాలో ప్రతి జిల్లాకు ఒక సహాయ పౌర సంబంధాల అధికారిని, ఇద్దరు పబ్లిసిటీ అసిస్టెంట్‌లను నియమించనున్నారు. హైదరాబాద్‌లోని కమిషనరేట్ లో ఒక పబ్లిసిటీ అసిస్టెంట్ పోస్టును భర్తీ చేయనున్నారు.

రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సమాచార పౌర సంబంధాల శాఖలో పోస్టులు భర్తీ చేయడం ఇదే తొలిసారి. మంత్రిగా ప్రమాణా స్వీకారం చేపట్టిన వెంటనే డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి సమాచార పౌర సంబంధాల శాఖలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది కొరత, వాహనాలు, సాంకేతిక పరికరాల కొరత ఉందన్న విషయాన్ని అధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. శాఖను బలోపేతం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటానని అధికారులకు హామీ ఇచ్చిన మంత్రి వెంటనే ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావుకు సమస్యలపై నివేదిక సమర్పించారు. ప్రభుత్వ పథకాలను ప్రచారం చేసి ప్రజలకు అవగాహన కల్పించే పౌర సంబంధాల శాఖను పటిష్టం చేయాలని ముఖ్యమంత్రిని ఒప్పించడంతో సిఎం కూడా సానుకూలంగా స్పందించి పోస్టుల భర్తీకి ఆమోద ముద్ర వేశారు. మిగిలిన సమస్యలను కూడా వీలైనంత త్వరలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని మంత్రి తెలిపారు. జి.ఓ.నెం.1384 విడుదలపై సమాచార శాఖ అధికారులు హర్షం వ్యక్తం చేశారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News