Saturday, May 4, 2024

లింగంపల్లి – విజయవాడ.. ఇంటర్‌సిటి ఎసి ఎక్స్‌ప్రెస్ రైలు పునరుద్ధరణ

- Advertisement -
- Advertisement -

Intercity AC Express train restoration

 

మనతెలంగాణ/హైదరాబాద్ : లింగంపల్లి -టు విజయవాడ మధ్య నడిచే ఇంటర్‌సిటీ ఏసీ ఎక్స్‌ప్రెస్ రైలును పునరుద్ధరించినట్టు దక్షిణమధ్య రైల్వే తెలిపింది. 9వ తేదీన (బుధవారం) నుంచి ఈ ప్రత్యేక రైలు విజయవాడ నుంచి ప్రారంభమయ్యింది. 10వ తేదీన లింగంపల్లి నుంచి ఈ రైలు తిరిగి బయలుదేరుతుంది. తర్వాత ప్రతి రోజూ ఉదయం లింగంపల్లి నుంచి విజయవాడకు, సాయంత్రం విజయవాడ నుంచి లింగంపల్లికి ప్రయాణం కొనసాగిస్తుంది.

లింగంపల్లి నుంచి 02796 నంబర్‌తో ఈ రైలు ప్రతి రోజూ వేకువజామున 4.40 గంటలకు బయలుదేరి సికింద్రాబాద్‌కు ఉదయం 5.20 గంటలకు చేరుకొని సాయంత్రం 5.30కి తిరిగి బయలుదేరుతుంది. ఉదయం 10.30 గంటలకు విజయవాడకు చేరుకుంటుంది. విజయవాడ నుంచి 02795 నంబర్‌తో ప్రతి రోజు సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరి సికింద్రాబాద్‌కు రాత్రి 10.15 గంటలకు చేరుకుని తిరిగి 10.20 గంటలకు బయలుదేరి లింగంపల్లికి 11.20 గంటలకు చేరుకుంటుంది. ఏసీ చైర్‌కార్‌తో పాటు నాన్ ఏసీలో కూర్చొనే వెసులుబాటును అధికారులు కల్పించారు. కరోనా నేపథ్యంలో శానిటైజేషన్ చేసిన తర్వాత రైలు బయలుదేరుతుంది. మొత్తం సీట్లన్నింటికీ రిజర్వేషన్ సౌకర్యం కల్పించారు. రిజర్వేషన్ ఉన్నవారినే దీనిలోకి అనుమతిస్తారు.

రాత్రి 10.30కి బదులుగా రాత్రి 11 గంటలకు

దీంతో పాటు హైదరాబాద్- హజ్రత్ నిజాముద్దీన్‌ల మధ్య ప్రతిరోజు నడుస్తున్న దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ (నంబరు.02721/02722) ప్రత్యేక రైలు రాకపోకల సమయాలు జనవరి 1వ తేదీ నుంచి మారుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ రైలు హైదరాబాద్ నుంచి రాత్రి 10.30కి బదులుగా రాత్రి 11 గంటలకు బయల్దేరుతుంది. హజ్రత్ నిజాముద్దీన్ (ఢిల్లీ) స్టేషన్‌కు రెండోరోజు తెల్లవారుజామున 4.05 గంటలకు బదులుగా 3.40కి చేరుకుంటుంది. హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్ నుంచి రాత్రి 11 గంటలకు బదులుగా 10.50గంటలకి బయలుదేరి హైదరాబాద్ స్టేషన్‌కు రెండోరోజు తెల్లవారుజామున 4.45కి బదులుగా 3.40 గంటలకు చేరుకుంటుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News