Sunday, May 5, 2024

ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు వడ్డీ రహిత రుణాలు

- Advertisement -
- Advertisement -

Interest-free loans for financially backward students

బెనారస్ హిందూ యూనివర్శిటీ కీలక నిర్ణయం

వారణాసి : ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల కోసం బనారస్ హిందూ యూనివర్శిటీ (బీహెచ్‌యూ) కీలక నిర్ణయం తీసుకుంది. బలహీనమైన ఆర్థిక పరిస్థితి కారణంగా చదువుకునేందుకు ఇబ్బందులు పడుతున్న విద్యార్థులకు వడ్డీ రహిత రుణ సహాయ పథకాన్ని బీహెచ్‌యూ ప్రారంభించింది. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలు, కొవిడ్ వల్ల తల్లిదండ్రులు మరణించిన వారి విద్యార్థులకు ఏటా వార్షిక సహాయంగా రూ.12 వేలను ఇవ్వాలని నిర్ణయించారు. బిహెచ్‌యూ ఫ్యాకల్టీ సభ్యుల సిఫార్సు మేరకు విద్యార్థులకు ఈ ఆర్థిక సాయం అందించనున్నారు. విద్యార్థులు తమ చదువులను పూర్తి చేసేందుకు వీలుగా విశ్వవిద్యాలయం అన్ని విధాలా సహాయ సహకారాలు అందజేస్తుందని వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సుధీర్ కుమార్ జైన్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతానికి 1000 మంది విద్యార్థులకు ఈ పథకం ప్రయోజనం అందించనున్నారు. ఈమేరకు ఇప్పటివరకు 200 దరఖాస్తులు రాగా, వాటిలో 103 దరఖాస్తులను ఆమోదించినట్టు జైన్ తెలిపారు. విద్యార్థి ఉపాధి పొందిన తర్వాత రెండేళ్లలో వాయిదాల వారీగా రుణాలు చెల్లించవచ్చని వీసీ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News