Monday, May 6, 2024

ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించిన ఇంటర్మీడియట్ అధికారి

- Advertisement -
- Advertisement -

దుబ్బాక:  ఇంటర్మీడియట్ జిల్లా పరీక్షల కన్వీనర్ సూర్యప్రకాశ్ శుక్రవారం దుబ్బాక ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని పరీక్ష కేంద్రాన్ని సందర్శించి రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమవారం నుంచి ప్రారంభమైన సప్లమెంటరీ పరీక్షలు శనివారంతో ముగుస్తాయన్నారు. దుబ్బాక కళాశాలలో పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయన్నారు. అదే విధంగా ఈ నెల 21వ తేది నుంచి సిద్దిపేట ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఇంటర్మిడియట్ జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రీయ విధులకు అలాట్ చేయబడ్డ లెక్చరర్లు ఆయా తేదిల ప్రకారం తప్పనిసరిగా విధుల్లో చేరాల్సి ఉంటుందన్నారు.

ఎవరైనా విధులకు హాజరు కాకపోతే నిబంధనల ప్రకారం వారిపై కఠీన చర్యలు తీసుకుంటామన్నారు. దుబ్బాక పట్టణంలో సిఎం కెసిఆర్, మంత్రిహరీశ్‌రావు చొరవతో నూతనంగా ప్రారంభించబడ్డ కళాశాల భవనంలో అన్ని వసతులతో కూడిన ,నాణ్యమైన విద్యాబోధన కొనసాగుతుందన్నారు. పదవ తరగతి పూర్తి చేసిన విద్యార్థ్ధులు ప్రైవేట్ వైపు మొగ్గు చూపకుండా ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనే జనరల్, ఓకేషనరల్ కోర్సుల్లో చేరాలన్నారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక ప్రభుత్వ జూనియర్ కళాశాల చీప్ సూపరింటెండెంట్ శివకుమార్, డిపార్ట్‌మెంట్ ఆఫీసర్ బాస్కర్, సిట్టింగ్ స్కాడ్ నగేశ్ కళాశాల సిబ్బంది ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News