Wednesday, May 1, 2024

అలా అవుతుందని అనుకోలేదు

- Advertisement -
- Advertisement -

Interview with Hero Nani

 

న్యాచురల్ స్టార్ నాని నటించిన ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమాను నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నా రు. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్లు హీరోయిన్లుగా నటించిన ఈ మూవీని శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతోన్నారు. ఈ సందర్భంగా నాని మీడియాతో ముచ్చటిస్తు చెప్పిన విశేషాలు…

అద్భుతంగా రూపుదిద్దుకుంది

‘శ్యామ్ సింగ రాయ్’కి అద్భుతమైన కథ దొరికింది. కథే కాకుండా నటీనటులు దొరికారు. ఈ సినిమాకు మంచి టెక్నీషియన్స్ పని చేశారు. అలా అంతా కలిసి చేసిన ఈ సినిమా అద్భుతంగా రూపుదిద్దుకుంది.

ఆ సినిమాతో పోలిక ఉండదు

కమల్ హాసన్ ‘నాయకుడు’, ఈ సినిమాకు సంబంధం ఉండదు. కానీ నేను కమల్ అభిమానిని కావడంతో ఎక్కడో చోట ఆయన ప్రభావం ఉంటుంది. కానీ కథ పరంగా ఎక్కడా పోలిక ఉండదు.

అవి స్టోరీ మీద ప్రభావాన్ని చూపుతాయి

‘శ్యామ్ సింగ రాయ్’లో నాలుగు ఎపిసోడ్స్ ఉంటాయి. వాటిని ఎపిసోడ్స్ ల చూడటం నాకు నచ్చదు. కానీ అవి వచ్చినప్పుడు కచ్చితంగా గూస్‌బంప్స్ మూమెంట్స్ అవుతాయి. వాటిని ఈ కథలో మలిచిన తీరు అద్భుతం. అవి స్టోరీ మీద ఎంతో ప్రభావాన్ని చూపుతాయి.

ఎపిక్ లవ్ స్టోరీ

శ్యామ్ సింగ రాయ్ పోరాటం చెడు మీద ఉంటుంది. అందులో దేవదాసీ వ్యవస్థ కూడా ఉంటుంది. శ్యామ్ సింగ రాయ్ అనేది ఎపిక్ లవ్ స్టోరీ. ఇది పూర్తిగా కల్పితం.

అలా అవుతుందని అనుకోలేదు

సిరివెన్నెల సీతారామశాస్త్రి మాకు పాట రాయడం ఆనందంగా ఉంది. ఇది చివరి పాట అవుతుందేమో అని సిరివెన్నెల అన్నట్టుగా దర్శకుడు రాహుల్ నాతో చెప్పాడు. కానీ అలా అవుతుందని మేం అనుకోలేదు. ఇక ఆ పాటలోనే సినిమా మొత్తం చెప్పేశారు. అది సినిమా చూస్తే అర్థమవుతుంది.

తదుపరి చిత్రాలు

దసరా సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. తెలంగాణ యాసను తెలంగాణ వారి కంటే స్పష్టంగా పలుకుతాను. ప్రస్తుతం నా చేతిలో ‘అంటే సుందరానికీ’, దసరా సినిమాలున్నాయి. నా తదుపరి చిత్రాలను దక్షిణాది భాషల్లో రిలీజ్ చేస్తాం. హిందీకి సరిపడా కథ వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాను.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News