Wednesday, May 1, 2024

కథలో ఆ సీన్స్ అవసరం అనిపిస్తేనే చేస్తా

- Advertisement -
- Advertisement -

Interview with Heroine Krithi Shetty

నేచురల్ స్టార్ నాని ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమాను నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద వెంకట్ బోయనపల్లి నిర్మించారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లు హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ తాజాగా విడుదలై విజయవంతంగా దూసుకుపోతోంది. ఈ క్రమంలో హీరోయిన్ కృతి శెట్టి మీడియాతో మాట్లాడుతూ “ఉప్పెన, శ్యామ్ సింగ రాయ్ సినిమాల్లోని పాత్రలకు చాలా తేడా ఉంది. శ్యామ్ సింగ రాయ్ సినిమా కోసం ఇంగ్లీష్ సినిమాలు, మోడ్రన్ అమ్మాయిలు ఎలా ఉంటారో తెలుసుకొని నా స్టైల్లో నటించాను. ఈ సినిమాలో కీర్తి పాత్రకు తల్లి ఉండదు. తండ్రి పెంపకంలోనే పెరుగుతుంది. అప్పుడు కాస్త మగరాయుడిలా ఉంటే బాగుంటుందని దర్శకుడికి చెప్పాను. నాకు స్మోకింగ్ అంటే నచ్చదు. కానీ ఈ పాత్ర కోసం అదే ఛాలెంజింగ్‌గా అనిపించింది. నానితో నటించడం అంటే మొదట్లో నాకు భయం వేసింది. కానీ ఆయన సెట్‌లో ఎంతో ప్రోత్సహించేవారు.

బోల్డ్ సీన్స్ అంటే అంతా బ్యాడ్ అని అనుకుంటారు. ఏం చేసినా కూడా వృత్తి పరంగానే మేం చేస్తాం. యాక్షన్ సీక్వెన్స్‌లో ఎంత కష్టపడతారో అన్ని సీన్లకు అలానే కష్టపడతారు. అన్ని సీన్లలోనూ నటించినట్టే ఆ సన్నివేశాల్లోనూ నటిస్తాను. కథలో ఆ సీన్స్ అవసరం అనిపిస్తేనే చేస్తాను. లేదంటే నేను చేయను. ఇక ‘శ్యామ్ సింగ రాయ్’లో వాటితో కథ ముడి పడి ఉంది. ఉప్పెన సినిమాలో నటించే స్కోప్ ఎక్కువగా ఉంది. కానీ ఇందులో నాలోని ఇంకో కోణాన్ని చూపించే ఛాన్స్ వచ్చింది. ఇక ‘బంగార్రాజు’ షూటింగ్ పూర్తయింది. ‘మాచర్ల నియోజకవర్గం’ ఏప్రిల్‌లో వస్తుంది. రామ్‌తో సినిమా ఇంకా షూటింగ్ జరుగుతోంది”అని అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News