Monday, April 29, 2024

జి 20 క్లీన్ ఎనర్జీ మినిస్ట్రీయల్ సమావేశానికి తెలంగాణకు ఆహ్వానం

- Advertisement -
- Advertisement -
హాజరైన జయేష్ రంజన్..జానయ్య

హైదరాబాద్ : గోవాలో జూలై 19వ తేదీ నుండి 22వ తేదీ వరకు జి 20 క్లీన్ ఎనర్జీ మినిస్ట్రీయల్ ఎనిమిదవ మిషన్ ఇన్నోవేషన్ మీటింగ్ జరుగుతోంది. ఇందులో భాగంగా తెలంగాణకు ఆహ్వానం అందగా మన రాష్ట్రం నుండి తెలంగాణ ప్రభుత్వ పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్, రెడ్కో విసి ఎండి జానయ్యలు హాజరయ్యారు. క్లీన్ ఎనర్జీని ప్రోత్సహించడానికి తెలంగాణ ప్రభుత్వం , తెలంగాణ స్టేట్ సోలార్ ఎనర్జీ అసోసియేషన్‌ని రాష్ట్రంలో చాలా అభివృద్ధి చెందుతున్న సంస్థగా గుర్తించి ఈ జి20 ఎనర్జీ ట్రాన్స్‌మిషన్ మినిస్ట్రీయల్ మీటింగ్‌లో పాల్గొనటానికి అవకాశం కల్పించింది.

‘అడ్వాన్సింగ్ క్లీన్ ఎనర్జీ టుగెదర్’ అనేది ఈ కార్యక్రమం యొక్క థీమ్ అని తెలంగాణ రాష్ట్ర రెడ్‌కో వైస్ ఛైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ జానయ్య తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో టి ఎస్‌ఈఏ ప్రెసిడెంట్ బుర్ర అశోక్ కుమార్ గౌడ్ , సెక్రెటరీ హరిబాబులు పాల్గొన్నారు. ఇంకా ఈ నాలుగు రోజుల కార్యక్రమంలో వివిధ సీఎంలు , ముఖ్య అతిథిగాకేంద్ర మంత్రి ఆర్కే సింగ్ పవర్ అండ్ రెన్యువల్ ఎనర్జీ , ఆయా సంస్థల కేంద్ర, రాష్ట్ర సెక్రటరీలు అన్ని ప్రభుత్వ విభాగాల అధిపతులు విదేశీ సంస్థలు, పరిశోధకులు, ఆవిష్కర్తలు, పెట్టుబడుల సంస్థలు.. పాల్గొన్నాయి. కాగా దాదాపు 20 కంటే ఎక్కువ దేశాలు ప్రతినిధులు భాగస్వామ్యలుగా ఉన్నటువంటి ఈ జి 20 అంతర్జాతీయ కార్యక్రమములో తెలంగాణ రాష్ట్రం తరఫున తాము పాల్గొనడం సంతోసంగా ఉందని జానయ్య ఈ సందర్భంగా తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News