Thursday, May 16, 2024

విదేశీ సిగరేట్లు విక్రయిస్తున్న ముగ్గురి అరెస్టు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః నిషేధిత విదేశీ సిగరేట్లు విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.4.50లక్షల విలువైన సిగరేట్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…హైదరాబాద్‌కు చెందిన సయిద్ అజీముద్దిన్ కిరాణ షాపు నిర్వహిస్తున్నాడు. మహ్మద్ అజార్ అలీ, రాజురామ్ కుమావత్ కలిసి విక్రయిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిషేధించిన వివిధ బ్రాండ్ల సిగరేట్లను సయిద్ అజీముద్దిన్ విక్రయిస్తున్నాడు.

ఈ విషయం తెలిసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా తనకు విదేశీ సిగరేట్లను విక్రయిస్తున్న వారి పేర్లు చెప్పాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు వారిని పట్టుకున్నారు. మిగతా ఇద్దరు నిందితులు సులభంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేసి తక్కువ ధరకు నిషేధిత సిగరేట్లను కొనుగోలు చేసి తీసుకుని నగరానికి వచ్చి ఇక్కడ ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు దర్యాప్తు కోసం స్థానిక పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇన్స్‌స్పెక్టర్ రమేష్ నాయక్, ఎస్సైలు అనంతచారి, సాయిరాం, రాఘవేంద్రరెడ్డి పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News