Wednesday, May 15, 2024

పాక్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ కు గుండెపోటు

- Advertisement -
- Advertisement -

లాహోర్: పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ గుండెపోటుకు గురయ్యారు. ఆయనకు ఛాతిలో నొప్పి రావడంతో లాహోర్‌లోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. కొన్ని రోజులుగా ఇంజమామ్ ఛాతి నొప్పితో బాధపడుతున్నారు. అయితే సోమవారం రాత్రి నొప్పి తీవ్రమవ్వడంతో వైద్యులు గుండె పోటుగా నిర్ధారించారు. ప్రస్తుతం ఇంజమామ్‌కు యాంజియోప్లాస్టి చికిత్స చేసినట్టు తెలిసింది. ఇక ఇంజమామ్ అస్వస్థతకు గురైన విషయాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కూడా ధ్రువీకరించింది. ప్రపంచంలోని అత్యుత్తమ క్రికెటర్లలో ఇంజమామమ్ ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. కెప్టెన్‌గా, బ్యాట్స్‌మన్, పిసిబి సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా ఆయన పాకిస్థాన్ క్రికెట్‌పై తనదైన ముద్ర వేశారు. ఇక 1992లో పాకిస్థాన్ వన్డే ప్రపంచకప్ సాధించడంలో ఇంజమామ్ కీలక పాత్ర పోషించారు. సెమీస్‌తో పాటు, ఫైనల్లో ఇంజమామ్ దూకుడుగా ఆడిన పాక్‌కు విజజయం అందించారు. సుదీర్ఘ కెరీర్‌లో ఇంజమామ్ 119 టెస్టులు, 375 వన్డేలు ఆడారు. టెస్టుల్లో 8,829, వన్డేల్లో 11,701 పరుగులు సాధించారు. కాగా 2001 నుంచి 2007 వరకు పాకిస్థాన్ కెప్టెన్ బాధ్యతలు నిర్వర్తించారు.

Inzamam ul Haq hospitalized with heart attack

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News