Tuesday, May 14, 2024

సన్ రైజర్స్ పై ముంబై ఘన విజయం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం

డికాక్ మెరుపులు, రాణించిన బౌల్ట్, వార్నర్ శ్రమ వృథా

IPL 2020: MI Won by 34 Runs against SRH

షార్జా: ఐపిఎల్‌లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ విజయపరంపర కొనసాగుతోంది. ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై 34 పరుగుల తేడాతో ఘణ విజయం సాధించింది. ఈ గెలుపుతో ముంబై పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 174 పరుగులు మాత్రమే చేసి పరాజయం పాలైంది. ఈ సీజన్‌లో వార్నర్ సేనకు ఇది మూడో ఓటమి కావడం గమనార్హం.
వార్నర్ ఒంటరి పోరాటం
క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌కు ఓపెనర్లు జానీ బైర్‌స్టో, డేవిడ్ వార్నర్ శుభారంభం అందించారు. ఇద్దరు ముంబై బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. బైర్‌స్టో అద్భుత షాట్లతో అలరించాడు. ధాటిగా ఆడిన బైర్‌స్టో రెండు ఫోర్లు, మరో రెండు సిక్సర్లతో 15 బంతుల్లోనే 25 పరుగులు చేశాడు. అయితే ప్రమాదకరంగా మారిన బైర్‌స్టోను ట్రెంట్ బౌల్ట్ అద్భుత బంతితో పెవిలియన్ పంపించాడు. తర్వాత వచ్చిన మనీష్ పాండే కూడా ధాటిగా ఆడాడు. ఇటు వార్నర్, అటు మనీష్ బ్యాట్‌ను ఝులిపించడంతో స్కోరు వేగంగా పరిగెత్తింది. ఈ జోడీని విడగొట్టేందుకు ముంబై బౌలర్లు చాలా సేపు వేచి చూడాల్సి వచ్చింది. కీలక ఇన్నింగ్స్ ఆడిన మనీష్ 4 ఫోర్లు, ఒక సిక్స్‌తో 30 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత హైదరాబాద్ వరుస క్రమంలో వికెట్లను కోల్పోయింది. జట్టును ఆదుకుంటాడని భావించిన స్టార్ బ్యాట్స్‌మన్ కేన్ విలియమ్సన్ నిరాశ పరిచాడు. 3 పరుగులు మాత్రమే చేసి బౌల్ట్ బౌలింగ్‌లో వికెట్ల వెనుకాల దొరికి పోయాడు. తర్వాత వచ్చిన ప్రియమ్ గార్గ్ కూడా జట్టుకు అండగా నిలువలేక పోయాడు. కిందటి మ్యాచ్‌లో మెరుపులు మెరిపించిన గార్గ్ ఈసారి ఆ జోరును కొనసాగించడంలో విఫలమయ్యాడు. 8 పరుగులు చేసిన గార్గ్‌ను కృనాల్ వెనక్కి పంపాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా కెప్టెన్ వార్నర్ ఒంటరి పోరాటం చేశాడు. ముంబై బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న వార్నర్ 44 బంతుల్లో ఐదు ఫోర్లు, రెండు సిక్స్‌లతో 60 పరుగులు సాధించాడు. చివర్లో సమద్ (20) కాస్త ధాటిగా ఆడినా ఫలితం లేకుండా పోయింది. ముంబై బౌలర్లు కచ్చితమైన లైన్ అండ్ లెన్త్‌తో బౌలింగ్ చేసి జట్టును గెలిపించారు.
డికాక్ జోరు
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ముంబైకి ఓపెనర్ క్వింటాన్ డికాక్ అండగా నిలిచాడు. తొలి మూడు మ్యాచుల్లో విఫలమైన డికాక్ ఈసారి మాత్రం మెరుగైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. హైదరాబాద్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును పరిగెత్తించాడు. మరోవైపు కెప్టెన్ రోహిత్ శర్మ (6) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరాడు. వన్‌డౌన్‌లో వచ్చిన సూర్యకుమార్‌తో కలిసి డికాక్ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచాడు. సూర్యకుమార్ ఆరు ఫోర్లతో 27 పరుగులు చేశాడు. ధాటిగా ఆడిన డికాక్ 39 బంతుల్లోనే 4 భారీ సిక్సర్లు, మరో 4 బౌండరీలతో 67 పరుగులు సాధించాడు. మరోవైపు ఇషాన్ కిషన్ (31), హార్దిక్ పాండ్య (28), పొలార్డ్ (20), కృనాల్ 20 (నాటౌట్) మెరుపులు మెరిపించడంతో ముంబై స్కోరు 208 పరుగులకు చేరింది. హైదరాబాద్ బౌలర్లలో రషీద్ ఖాన్ ఒక్కడే పొదుపుగా బౌలింగ్ చేశాడు.
స్కోరు బోర్డు
ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సి) బైర్‌స్టో (బి) సందీప్ శర్మ 6, డికాక్ (సి) అండ్ (బి) రషీద్ ఖాన్ 67, సూర్యకుమార్ యాదవ్ (సి) నటరాజన్ (బి) సిద్దార్థ్ కౌల్ 27, ఇషాక్ కిషన్ (సి) మనీష్ (బి) సందీప్ 31, హార్దిక్ పాండ్య (బి) సిద్ధార్థ్ కౌల్ 28, పొలార్డ్ నాటౌట్ 25, కృనాల్ పాండ్య నాటౌట్ 20, ఎక్స్‌ట్రాలు 4, మొత్తం 20 ఓవర్లలో 208/5.
బౌలింగ్: సందీప్ శర్మ 40412, టి.నటరాజన్ 40290, సిద్ధార్థ్ కౌల్ 40642, అబ్దుల్ సమద్ 20270, రషీద్ ఖాన్ 40221, విలియమ్సన్ 20240.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: డేవిడ్ వార్నర్ (సి) ఇషాన్ (బి) జేమ్స్ పాటిన్సన్ 60, జానీ బైర్ స్టో (సి) హార్దిక్ (బి) ట్రెంట్ బౌల్ట్ 25, మనీష్ పాండే (సి) పొలార్డ్ (బి) పాటిన్సన్ 30, విలియమ్సన్ (సి) డికాక్ (బి) బౌల్ట్ 3, ప్రియమ్ గార్గ్ (సి) రాహుల్ (బి) కృనాల్ 8, అభిషేక్ శర్మ (బి) బుమ్రా 10, అబ్దుల్ సమద్ (సి) రోహిత్ (బి) బుమ్రా 20, రషీద్ ఖాన్ నాటౌట్ 3, సందీప్ శర్మ నాటౌట్ 0, ఎక్స్‌ట్రాలు 15, మొత్తం 20 ఓవర్లలో 174/7.
బౌలింగ్: ట్రెంట్ బౌల్ట్ 40282, జేమ్స్ పాటిన్సన్ 40292, కృనాల్ పాండ్య 40351, బుమ్రా 40412, పొలార్డ్ 30200, రాహుల్ చాహర్ 10161.

IPL 2020: MI Won by 34 Runs against SRH

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News