Friday, May 10, 2024

జులైకల్లా 50 కోట్ల డోసులు

- Advertisement -
- Advertisement -

50 crore vaccine doses by next July

 

తొలి విడతలో 20 నుంచి 25 కోట్ల మందికి వ్యాక్సిన్
కరోనా వారియర్లు, వయోవృద్ధులకు మొదటి ప్రాధాన్యం
అందరికి సమాన ప్రతిపాదికన అందుబాటులోకి తెస్తాం
అక్టోబర్‌లో రాష్ట్రాల నుంచి ప్రాధాన్యత జాబితాలు
కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రకటన

న్యూఢిల్లీ: కోవిడ్-19కు 2021 జులై వరకల్లా 40-50 కోట్ల వ్యాక్సిన్ డోసులు అందుబాటులోకి రానున్నట్టు అంచనా ఉన్నదని కేంద్ర ఆరోగ్యశాఖమంత్రి హర్షవర్ధన్ తెలిపారు. ప్రాధాన్యతా క్రమంలో కరోనాపై ముందు వరుసలో పోరాడుతున్నవారు, వయోవృద్ధులులాంటివారిలో 20-25కోట్లమందికి మొదటగా వాటిని అందిస్తామని ఆయన తెలిపారు. టీకాలు సిద్ధమైన తర్వాత దేశంలోని అందరికీ సమాన ప్రాదిపదికన అందుబాటులోకి తెస్తామని హర్షవర్ధన్ హామీ ఇచ్చారు. అక్టోబర్ చివరి వరకల్లా ప్రాధాన్యతా క్రమంలో వివిధ గ్రూపుల ప్రజల వివరాలను రాష్ట్రాల నుంచి తీసుకునేందుకు ఫార్మెట్‌ను సిద్ధం చేస్తున్నామని ఆయన తెలిపారు. ఆదివారం సోషల్ మీడియా వేదికగా ‘సండే సంసద్’ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో హర్షవర్ధన్ ఈ వివరాల్ని వెల్లడించారు.

టీకాల విషయంలో అన్ని రకాల అంశాలను పరిగణనలోకి తీసుకొని విధాన ప్రక్రియను రూపొందించడానికి నీతి ఆయోగ్ సభ్యుడు(ఆరోగ్యం) డాక్టర్ వికె పౌల్ నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. వ్యాక్సిన్ల సేకరణ కేంద్రం ఆధ్వర్యంలోనే జరుగుతుందని హర్షవర్ధన్ తెలిపారు. ఆయా ఔషధ సంస్థల క్లినికల్ పరీక్షలు వివిధ దశల్లో ఉన్నాయని, తయారీ సంస్థల నుంచి వ్యాక్సిన్లను సేకరించడం, పంపిణీ చేయడంలాంటి అన్ని అంశాల్ని కమిటీ పరిశీలిస్తుందని ఆయన తెలిపారు. హైరిస్క్ బృందాలకు ప్రథమ ప్రాధాన్యత ఉంటుందని ఆయన తెలిపారు.

కరోనా పేషెంట్లను గుర్తించడం, చికిత్స అందించడంలో ఫ్రంట్‌లైన్‌లో ఉండి పని చేసే ప్రభుత్వ, ప్రైవేట్ ఆరోగ్య సిబ్బంది(డాక్టర్లు, నర్సులు, వగైరా), పారిశుధ్య సిబ్బంది, ఆశా వర్కర్లు, నిఘా అధికారులులాంటి వారికి ప్రథమ ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను రాష్ట్రాలు అక్టోబర్ చివరి వరకల్లా కేంద్రానికి సమర్పించాలని హర్షవర్ధన్ తెలిపారు. బ్లాక్‌స్థాయి వరకు మౌలిక వసతులపై వివరాలు ఇవ్వాలని కూడా ఆయన తెలిపారు. వ్యాక్సిన్ల పంపిణీలో పారదర్శకత, జవాబుదారీతనంతో కేంద్రం వ్యవహరిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

రష్యా ఇప్పటికే ఉత్పత్తి, పంపిణీ ప్రారంభించిన స్పుత్నిక్‌వి టీకా గురించి ప్రశ్నించగా, ఇంకా అది పరిశీలనలో ఉన్నదని, దేశంలో మూడోదశ పరీక్షలకు అనుమతి విషయంలో నిర్ణయం తీసుకోలేదని ఆయన తెలిపారు. పలు తయారీ సంస్థలు మార్కెట్‌లోకి తెస్తున్న ఏ టీకా నాణ్యమైనదో చెప్పడం సాధ్యం కాదని,సురక్షితంగా పని చేస్తాయనుకుంటేనే ఎవరైనా అందుబాటులోకి తెస్తారని హర్షవర్ధన్ అన్నారు. ఇతరచోట్ల సురక్షితమని తేలిన వ్యాక్సిన్ల విషయంలో దేశంలో శాంపిల్ పరీక్షలు మాత్రమే నిర్వహించి, వేగంగా అందుబాటులోకి తెస్తామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News