Friday, April 26, 2024

యురేనియం శుద్ధి విధానంపై ఇరాన్ సంచలన నిర్ణయం

- Advertisement -
- Advertisement -

టెహరాన్: దేశంలోనే మొట్టమొదటిసారి 60 శాతం స్వచ్ఛమైన యురేనియంను శుద్ధి చేసే ప్రక్రియను ఇరాన్ ప్రారంభించినట్లు ఆ దేశ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ ఖలీబాఫ్ శుక్రవారం ప్రకటించారు. అయితే ఎంత పరిమాణంలో యురేనియం శుద్ధిని ఇరాన్ చేపట్టనున్నదో మాత్రం ఆయన వెల్లడించలేదు. ఇరాన్‌లోని నటాంజ్ వద్ద గల అణు శుద్ధి కర్మాగారంపై గత వారం ఇజ్రేల్ నిర్వహించిన దాడి తర్వాత ఇరాన్ ఈ చర్యకు పూనుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే పార్లమెంట్ స్పీకర్ చేసిన ప్రకటనను ఇరాన్ అణు ఇంధన సంస్థ ఇప్పటి వరకు ధ్రువీకరించలేదు. అణ్వస్త్రాల తయారీకి 90 శాతం స్వచ్ఛమైన యురేనియంను ఉపయోగిస్తారు. అయితే, ఇరాన్ కేవలం 60 శాతం స్వచ్ఛమైన యురేనియంను మాత్రమే శుద్ధి చేయగలుగుతోంది. ఇప్పటివరకు కేవలం 20 శాతం స్వచ్ఛతతో కూడిన యురేనియంను మాత్రమే ఇరాన్ శుద్ధి చేస్తోంది. అమెరికా తమపై విధించిన ఆర్థికపరమైన ఆంక్షలను ఉపసంహరించుకోవాలని ఇరాన్ గట్టిగా కోరుతున్న నేపథ్యంలో ఈ చర్యలకు ఇరాన్ పూనుకోవడం ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉంది.

Iran starts enriching uranium to 60 percent

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News