Friday, April 26, 2024

హార్ట్ ఫెయిల్యూర్ గుర్తించే ఇజ్రాయెల్ ‘ఎఐ’

- Advertisement -
- Advertisement -

గుండె వైఫల్యం చెంది ఆగిపోయే ప్రమాదకర పరిస్థితిని ముందుగానే పసిగట్ట గలమా ? అలాంటి అంచనా ముందుగానే నిర్ధారించగల కృత్రిమ మేథో సాంకేతిక (ఎఐ) పరిజ్ఞాన సాథనాన్ని ఇజ్రాయెల్ పరిశోధకులు కనుగొన్నారు. ఈ సాధనంతో రోగుల పరిస్థితిని ముందుగానే తెలుసుకోగలుగుతున్నారు. మయోసైటిస్‌తో బాధపడుతున్న రోగుల ఇసిజి పరీక్షలను ఈ కృత్రిమ మేథో (ఎఐ) సాధనంతో విశ్లేషించి వారి గుండె వైఫల్యాన్ని కొన్ని రోజుల ముందుగానే అంచనా వేస్తున్నారు. మయోసైటిస్ వ్యాధి గురించి ఇటీవల ప్రముఖంగా వినిపిస్తోంది. మయోసైటిస్ వల్ల భుజాలు, తుంటి వద్ద కండరాల్లో క్షీణత ఉంటుంది. ఈ రోగుల్లో గుండె వైఫల్యం చెందే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది.

2000 నుంచి 2020 లోగా మయోసైటిస్‌తో బాధపడే దాదాపు 89 మంది రోగుల మెడికల్ రికార్డులు, ఇసిజి స్కాన్ల నుంచి సేకరించిన డేటా ఫీడింగ్ చేసి ఎఐ ( ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) మోడల్‌ను పరిశోధకులు అప్‌డేట్ చేశారు. దీంతో ఇసిజిల్లో సూక్ష్మ అంశాలను కూడా ఎఐ గ్రహించి గుండె వైఫల్యాలను ముందుగానే కనుగొనగలిగింది. ఈ సాధనం తయారీ వెనుక పరిశోధకులు డాక్టర్ షహర్ షెల్లీ కృషి ఎంతో ఉంది. రాంబమ్ హెల్త్ కేర్ కాంపస్‌కు చెందిన రీసెర్చి హెడ్‌గా ఆయన ఉంటున్నారు. “ఎఐ మోడల్ ద్వారా మేం ఇసిజి టెస్ట్‌లు నిర్వహించాం.

సాధారణంగా డాక్టర్లు కనుగొనలేని సూక్ష్మ అంశాలతోపాటు గుండె వైఫల్యం రిస్కులో ఎవరు ఉన్నారో ఎఐ ముందుగానే కనుగొనగలిగింది.” అని వివరించారు. గుండె వైఫల్యం కారణంగా కొన్ని వేల మంది అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పుడీ సాధనంతో సకాలంలో వారికి వైద్య చికిత్స అందించడానికి , వారిని రక్షించడానికి వీలవుతుందని షెల్లీ చెప్పారు. షెల్లీ బృందంతోపాటు అమెరికాకు చెందిన మేయో క్లినిక్ మెడికల్ సెంటర్ కార్డియాలజీ విభాగం పరిశోధకులు కూడా పాలుపంచుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News