Saturday, May 4, 2024

కరాటే కళ్యాణిపై కేసు

- Advertisement -
- Advertisement -

Jagadgirigutta police registered case against actress Karate Kalyani

 

హైదరాబాద్ : అత్యాచారానికి గురైన బాలిక వివరాలు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన సినీనటి కరాటే కల్యాణిపై జగద్గిరిగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. కొన్ని నెలల క్రితం సైదాబాద్, సింగరేణి కాలనీలో ఓ బాలికపై జరిగిన అత్యాచారం సంచలనం సృష్టించింది. చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని పలువురు సోషల్ మీడియా వేదికగా గళమెత్తారు. ఈ క్రమంలోనే కళ్యాణి కూడా సోషల్ మీడియాలో బాలిక కుటుంబానికి అండగా పోస్టులు పెట్టారు. బాధితురాలి వివరాలను సామాజిక మాద్యమాల్లో వెల్లడించారు. జగద్గిరిగుట్ట ఎల్లమ్మబండ ప్రాంతానికి చెందిన నితేష్ అనే వ్యక్తి రంగారెడ్డి కోర్టులో ప్రైవేట్ కంప్లయింట్ దాఖలు చేశాడు. కోర్టు ఆదేశాల మేరకు కరాటే కల్యాణిపై జగద్గిరిగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News