Saturday, April 27, 2024

హైదరాబాద్ సిపిగా సివి ఆనంద్ బాధ్యతలు స్వీకరణ

- Advertisement -
- Advertisement -

CV Anand assumes charge as Hyderabad CP

 

హైదరాబాద్ :  హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా నియమితులైన సివి ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు. బషీర్‌బాగ్‌లోని నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో అంజనీకుమార్ నుంచి శనివారం బాధ్యతలు స్వీకరించారు. 1991 బ్యాచ్ ఐపిఎస్ అధికారిగా ఎంపికైన సివి ఆనంద్ తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో పనిచేశారు. వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్‌లో ఎసిపి,ఎస్పిగా పనిచేశారు. 2002లో రాష్ట్రపతి గ్యాలంటరీ అవార్డుకు ఎంపికయ్యారు. నగరంలో ఈస్ట్‌జోన్, సెంట్రల్ జోన్ డిసిపిగా పనిచేశారు. మూడేళ్లు విజయవాడ సిపిగా, సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా మూడేళ్లు పనిచేశారు. సివిల్ సప్లయ్స్ కమిషనర్‌గా, ఎక్సైజ్ డైరక్టర్‌గా రెండేళ్లు పనిచేశారు. తర్వాత కేంద్ర సర్వీసులకు వెళ్లి సిఐఎస్‌ఎఫ్ ఐజిగా పనిచేశారు. ఇటీవలే రాష్ట్ర క్యాటర్‌కు వచ్చిన సివి ఆనంద్ పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ క్రమంలోనే హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా నియమితులైనారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News