Saturday, May 4, 2024

పలు రికార్డులు బద్దలు కొట్టిన జైస్వాల్

- Advertisement -
- Advertisement -

డొమినికా: విండ్‌సోర్ పార్క్‌లో భారత్-వెస్టిండీస్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ రెండో రోజు టీమిండియా 113 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 312 పరుగులు చేసింది. దీంతో భారత్ 162 పరుగుల ఆధిక్యంలో ఉంది. యశస్వి జైస్వాల్ సెంచరీతో కదం తొక్కాడు. తొలి టెస్టులో సెంచరీ చేసి రికార్డు సృష్టించారు. ఓపెనర్‌గా విదేశీ గడ్డపై తొలి టెస్టులో శతకం బాదిన రికార్డు అతడి ఖాతాలో చేరడంతో పాటు ఐదో భారత క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. ఓపెనర్‌గా మూడో ఆటగాడిగా నిలిచాడు, గతంలో శిఖర్ ధావన్(2016లో), పృథ్వీషా(2018లో) సెంచరీలు చేశారు. అతి పిన్న వయసులో శతకం బాదిన లిస్టులో నాల్గోవాడిగా నిలిచాడు. తొలి టెస్టులో సెంచరీలో జాబితాలో భారత్ నుంచి 17వ ఆటగాడిగా ఉన్నాడు.
తొలి టెస్టు శతకం బాదిన వీరుల లిస్టు:
ఎల్.అమర్‌నాథ్, దీపక్ శోధన్, క్రిపాల్ సింగ్, అబ్బాస్ అలీ, హన్మంత్ సింగ్, గుండప్ప విశ్వనాథ్, ఎస్ అమర్‌నాథ్, అజారుద్దీన్, ప్రవీన్ ఆమ్రే, సౌరభ్ గంగూలీ, సెహ్వాగ్, సురేష్ రైనా, శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, పృథ్వీషా, శ్రేయస్ అయ్యర్, యశస్వి జైస్వాల్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News