Sunday, May 5, 2024

జెఇఇ మెయిన్ పరీక్షలు ప్రారంభం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ) ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐఐఐటీ) తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు దేశవ్యాప్తంగా నిర్వహించే జెఇఇ మెయిన్ మొదటి విడత పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. మొదటి రోజు బి.ఆర్క్, బి.ప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం పేపర్-2 పరీక్షలు జరిగాయి. మొదటి రోజు దేశవ్యాప్తంగా 437 పరీక్షా కేంద్రాలలో 63 వేల మంది విద్యార్థులు జెఇఇ మెయిన్ పేపర్ 2 పరీక్షలకు హాజరయ్యారు. బుధవారం నుంచి ఈ నెల 26వ వరకు మూడు రోజులపాటు బి.టెక్ సీట్ల కోసం పేపర్ -1 పరీక్షలు జరుగనున్నాయి. ఈ పరీక్షలను రెండు సెషన్లుగా ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు నిర్వహిస్తున్నారు.

JEE Mains 2021 Exam begin from Feb 24

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News