Friday, May 3, 2024

దేశ విభజన కాకుంటే జిన్నా మొదటి ప్రధాని అయ్యేవారు :రాజ్‌భర్

- Advertisement -
- Advertisement -

Jinnah first Prime Minister if not for partition of country: Rajbhar

 

లక్నో : దేశ విభజన ఆనాడు జరగకుండా ఉంటే మహమ్మదాలీ జిన్నా మొదటి ప్రధాని అయ్యేవారని సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ అధినేత ఓం ప్రకాష్ రాజ్‌భర్ వ్యాఖ్యానించారు. ఎన్నికల పొత్తులో మిత్రుడైన సమాజ్‌వాది అధినేత అఖిలేష్ యాదవ్ స్వాతంత్ర పోరాట యోధులుగా మహాత్మాగాంధీ, నెహ్రూ, వల్లభాయ్ పటేల్, మహమ్మదాలీ జిన్నా అని అభివర్ణించడంపై బిజెపి నేతలు, యుపి సిఎం యోగి ఆదిత్యనాధ్ తదితరులు విమర్శించడంపై రాజ్‌భర్ అఖిలేష్ యాదవ్‌కు మద్దతుగా ఈ వ్యాఖ్యలు చేశారు. మాజీ ఉప ప్రధాని అద్వానీ కూడా జిన్నాపై ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారని పేర్కొన్నారు. 1948 లో మహాత్మా గాంధీ హత్య తరువాత ఆర్‌ఎస్‌ఎస్‌పై ఆనాటి హోం మంత్రి వల్లభాయ్ పటేల్ నిషేధం విధించారని కూడా అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యానించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News