Tuesday, April 30, 2024

అమెరికాలో వీసా బ్యాన్ల ఎత్తివేత

- Advertisement -
- Advertisement -

అమెరికాలో వీసా బ్యాన్ల ఎత్తివేత
ట్రంప్ చర్యకు ప్రతిగా బైడెన్ నిర్ణయం

సాన్ డియిగో: అమెరికాలో వలసదారుల ప్రవేశంపై ట్రంప్ హయాంలో వెలువరించిన నిషేధపు ఆదేశాలను దేశాధ్యక్షులు జో బైడెన్ ఎత్తివేశారు. కరోనా వైరస్ వ్యాప్తి దశలో అమెరికాలోని కార్మికుల అవకాశాలకు ఇబ్బంది కలుగకూడదనే ఆలోచనతో ట్రంప్ తమ అధికారాంతంలో వీసాలు, గ్రీన్‌కార్డుల జారీని తాతాల్కికంగా నిలిపివేశారు. దీంతో అమెరికాకు వలసదార్ల రాకలు నిలిచిపొయ్యాయి. ట్రంప్ తీసుకున్న నిర్ణయం చివరికి దేశంలో పూర్తి స్థాయిలో చట్టబద్ధమైన వలదార్లను కూడా అడ్డుకున్నట్లే అయిందని, ఇది దేశ విధానాలకు ప్రతిఘాత చర్య అని న్యాయవాదులు పేర్కొన్న అంశాలతో బైడెన్ ఏకీభవించారు. తక్షణమే ఈ నిషేధ ఉత్తర్వులను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పలు దఫాలుగా గ్రీన్‌కార్డుల జారీపై నిషేధం విధిస్తూ వచ్చారు. చివరికి ఈ నిషేధపు గడువు ఈ ఏడాది మార్చి 31 వరకూ ఉంది. ట్రంప్ చూపిన కారణాన్ని కొత్త అధ్యక్షులు బైడెన్ తోసిపుచ్చారు. చట్టబద్ధమైన వలసదార్లకు కూడా అమెరికా తలుపులు మూయడం దేశ ప్రయోజనాల కోణంలో తప్పే అవుతుందని వ్యాఖ్యానించారు. ఇటువంటి చర్యలతో అమెరికాకు మేలు జరగబోదన్నారు. ఇక్కడ చట్టబద్ధంగా ఉంటూ, శాశ్వత నివాసులుగా ఉంటున్న వారి కుటుంబ సభ్యులు రాకుండా చేయడం మంచిది కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉండే ప్రతిభ, నైపుణ్యాలను వాడుకునే అమెరికా పరిశ్రమలకు ఇటువంటి బ్యాన్ నష్టం కల్గిస్తుందని ట్రంప్ చర్యపై మండిపడ్డారు. 2020 బడ్జెట్ సంవత్సరంలో విధించిన కరోనా కారణపు వీసాల ఫ్రీజ్‌తో దాదాపు 1,20,000 కుటుంబ ప్రాతిపదిక ప్రాధాన్యత క్రమపు వీసాలకు గండి పడిందని అమెరికన్ ఇమ్మిగ్రేంట్స్ లాయర్స్ అసోసియేషన్ తెలిపింది. ట్రంప్ హయాంలో దేశానికి ప్రయోజనకరమైన వృత్తులు అంటే ఆరోగ్య పరిరక్షణకు సంబంధించిన వైద్య వృత్తి, ఆరోగ్య చికిత్సల వంటి వాటిలో ఉండే వారికే ఉద్యోగ ప్రాతిపదిక వీసాలకు అవకాశం ఇచ్చారు. మిగిలిన వలసదార్ల ప్రవేశాన్ని నిషేధించారు. అంతేకాకుండా లాటరీ ద్వారా వీసాలు దక్కిన వేలాది మందికి కూడా ప్రవేశాలను నిలిపివేశారు.
ఆలస్యమైనా తిరిగి అమెరికా ప్రవేశాలు
ఇప్పుడు బైడెన్ తీసుకున్న నిర్ణయం తనకు అపరిమిత ఆనందం కల్గించిందని, ఇది తన క్లయింట్లకు మేలు చేస్తుందని కాలిఫోర్నియాకు చెందిన ఇమ్మిగ్రేషన్ లాయర్ కుర్టిస్ మోరిసన్ స్పందించారు. ట్రంప్ తీసుకున్న అప్పటి నిర్ణయంతో నిలిచిపోయిన వీసాలతో దేశంలో వీసాలు, గ్రీన్‌కార్డుల బ్యాక్‌లాగ్ కేవలం ఫ్యామిలీ ప్రాతిపదిక వీసాల విషయంలోనే 4,37,00కు చేరుకుందన్నారు. ట్రంప్ ఫ్రీజ్‌తో దెబ్బతిన్న వేలాది మంది తరఫున ఈ లాయర్ కోర్టుల్లో వాదించారు. ఇప్పుడు తన క్లయింట్లకు తిరిగి దారి ఏర్పడుతుందని, అయితే ఇప్పటికే అత్యధికమైన బ్యాక్‌లాగ్ పరిష్కారానికి ఏళ్ల తరబడి వేచి ఉండాల్సి ఉంటుంది. అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన ప్రతిష్టాత్మక చర్యలు తీసుకుంటే తప్ప ఫలితం ఉండదన్నారు.

Joe Biden Revoke Trump’s Visa ban

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News