Monday, April 29, 2024

మీడియాకు ఫేస్‌బుక్, గూగుల్ డబ్బు చెల్లించక తప్పదు

- Advertisement -
- Advertisement -
Australian Parliament approves new media law
కొత్త మీడియా చట్టానికి ఆస్ట్రేలియా పార్లమెంట్ ఆమోదం

కెన్‌బెరా : ఫేస్‌బుక్, గూగుల్ సంస్థలు తాము ప్రచురించే వార్తా కథనాలకు సంబంధించి ఆయా మీడియా సంస్థలకు రుసుం చెల్లించేలా కొత్త మీడియా చట్టాన్ని ఆస్ట్రేలియా పార్లమెంట్ గురువారం ఆమోదించింది. ఈమేరకు న్యూస్‌మీడియా బార్గైనింగ్ కోడ్ బిల్లుకు సవరణలు తెచ్చింది. ట్రెజరర్ జోష్ ఫ్రైడెన్‌బెర్గ్‌కు ఫేస్‌బుక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్క్ జుకర్‌బర్గ్‌కు మధ్య మంగళవారం కోడ్‌పై కుదిరిన ఒప్పందంలో సవరణలను ఆమోదించింది. ఈ సవరణల ఫలితంగా ఆస్ట్రేలియాలో వార్తల ప్రచురణపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయడానికి ఫేస్‌బుక్ అంగీకరించింది. ఈ బిల్లు వల్ల మీడియా సంస్థలు తాము సామాజిక మాధ్యమాలకు ఇచ్చే వార్తా కథనాలపై రెమ్యూనరేషన్ పొందడానికి వీలు కలుగుతుంది.

Australian Parliament approves new media law

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News