Wednesday, May 22, 2024

కాలాపానీ, లిపులేఖ్ భూభాగాలు భారత సరిహద్దు గ్రామాలవే

- Advertisement -
- Advertisement -

Kalapani and Lipulekh territories are villages bordering India

 

పిదోరగర్ : ఉత్తరాఖండ్ లోని కాలాపానీ, లిపులేఖ్ ప్రాంతాలు నేపాల్ భూభాగాలుగా ఇప్పుడు కొత్త మ్యాప్‌లో కనిపిస్తున్నప్పటికీ అధికారిక భూముల రికార్డులు మాత్రం వేరే కథనం చెబుతున్నాయి. నేపాల్ పార్లమెంటు దిగువ సభ శనివారం కొత్త మ్యాప్‌ను ఆమోదించిన తరువాత ఈ ప్రాంతాలపై భారత్‌లో అనేక ప్రతిస్పందనలు వచ్చాయి. భూముల స్థానిక రికార్డులు కూడా కాలాపానీ, లిపులేఖ్ ప్రాంతాలు భారత్ సరిహద్దు లోని గర్బియాంగ్, గుంజి అనే రెండు గ్రామాలకు చెందినవని దార్చులా సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ఎకె శుక్లా ఆ రికార్డులు చూపించారు. కాలాపానీ, నభిధంగ్ లకు చెందిన 190 ఎకరాల భూమి గర్బియాంగ్ గ్రామస్థుల పేర్లపై రిజిస్టర్ అయి ఉందని, లిపులేఖ్ వద్ద నున్న భూమి గుంజి గ్రామస్థుల ఉమ్మడి భూమిగా రికార్డుల్లో ఉందని శుక్లా తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News