Monday, April 29, 2024

చైనా ప్రత్యామ్నాయంపై నేపాల్ తెలివితక్కువ ఆలోచన

- Advertisement -
- Advertisement -

Nepal is stupid thought on China alternative

 

నేపాల్ ఆర్థిక వేత్త పాండే వ్యాఖ్య

ఖాట్మండ్: భారత్-‌నేపాల్ దేశాలు అన్ని విధాలా పరస్పర సంబంధాలతో ముడిపడి ఉన్నందున ఈ సంబంధాలు క్షీణించరాదని అలాగే తమకు చైనాయే భారత్‌కు ప్రత్యామ్నాయమని నేపాల్ ఆలోచించడం తెలివి తక్కువ తనమని నేపాల్ ఆర్థిక వేత్త డాక్టర్ పోష్‌రాజ్‌పాండే సోమవారం వ్యాఖ్యానించారు. భారత భూభాగాలైన లిపులేఖ్, కాలాపాని,లింపియధుర, తమ భూభాగాలుగా నిర్ధారిస్తూ నేపాల్ రాజ్యాంగం మార్పునకు ప్రయత్నించడంపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

సౌత్ ఆసియా వాచ్ ఆన్ ట్రేడ్ ఎకనామిక్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (ఎస్‌ఎడబ్లుటిఇఇ) ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా పాండే పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భారత్ నుంచి సరఫరా అయ్యే అత్యవసర సరకులు, వస్తువులపై నేపాల్ ఆధారపడి ఉంటుందని, అందువల్ల ఈ రెండు దేశాల సంబంధాలకు నష్టం కలగకూడదని ఆయన సూచించారు. రెండింట మూడొంతుల దిగుమతులు భారత్ నుంచే నేపాల్‌కు వస్తాయని, చైనా నుంచి కేవలం 14 శాతమే దిగుమతులు ఉంటాయని ఈ సందర్భంగా ఉదహరించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News