Saturday, May 11, 2024

మణిపూర్ వీడియో: ఆ ఇద్దరిలో ఒకరు కార్గిల్ యుద్ధవీరుడి భార్య

- Advertisement -
- Advertisement -

ఇంఫాల్: మణిపూర్‌లో నగ్నంగా ఊరేగించిన ఇద్దరు మహిళల్లో ఒకరు కార్గిల్ యుద్ధవీరుడి భార్య అన్న విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. బుధవారం రాత్రి వెలుగుచూసిన వీడియోల ద్వారా పెద్ద సంఖ్యలో మూకలు ఇద్దర గిరిజనమహిళలను నగ్నంగాఊరేగించి వారిపై అత్యాచారానికి పాల్పడినట్లు ప్రపంచానికి తెలిసింది. అయితే తాను దేశాన్ని కాపాడగలిగానే కాని తన భార్య మానాన్ని కాపాడుకోలేకపోయానంటూ ఆ కార్గిల్ యుద్ధ వీరుడు ఆక్రోశించారు.

మే 4వ తేదీన జరిగిన ఈ దురాగతానికి సంబంధించిన వీడియో బుధవారం రాత్రి వెలుగు చూడగా దేశవ్యాప్తంగా దీనిపై ఆగ్రహం వ్యక్తమైంది.ఆ ఇద్దరు మహిళల్లో ఒకరు అస్సాం రెజిమెంట్‌లో సుబేదార్‌గా పనిచేసి భారతీయ సైన్యం నుంచి పదవీ విరమణ చేసిన ఒక సైనికుడి భార్య అని తెలిసింది.

కార్గిల్ యుద్ధంలో తాను దేశం కోసం పోరాడానని, శ్రీలంకలో కూడా ఐపికెఎఫ్‌లో భాగంగా పనిచేశానని ఆ మా.జీ సైనికుడు ొక హిందీ న్యూస్ చానల్‌కు తెలిపారు. తాను దేశాన్ని కాపాడానే కాని రిటైర్‌మెంట్ తర్వాత ఓడిపోయానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన ఇంటిని, భార్య, తోటి గ్రామస్తులను రక్షించుకోలేకపోయానని, ఇందుకు తాను రిచారిస్తున్నానని ఆయన తెలిపారు.

ఆ సమయంలో పోలీసులు అక్కడే ఉన్నప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆయన చెప్పారు. ఇళ్లను తగలబెట్టి, మహిళల పట్ల అమానుషంగా ప్రవర్తించిన వారందరినీ కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు.

వీడియో బయటపడిన తర్వాత ఇప్పటి వరకు ఈ ఘటనకు సంబంధించి నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని అరెస్టు చేసేందుకు పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటున్నారని, దాడులు కొనసాగిస్తున్నామని మణిపూర్ పోలీసులు ట్విట్టర్ పోస్టులో తెలిపారు.

తమకు షెడ్యూల్డ్ తెగల(ఎస్‌టి) హోదా ఇవ్వాలన్న మీటీ తెగలవారి డిమాండుకు నిరసిస్తూ మే 3వ తేదీన అన్ని పర్వత జిల్లాలలో కుకీలు గిరిజన సంఘీభావ యాత్ర నిర్వహించిన సందర్భంగా హింసాకాండ చెలరేగింది. అప్పటి నుంచి జరిగిన హింసాత్మక ఘటనల్లో 160 మందికిపైగా ప్రజలు మరణించగా వందలాది మంది గాయపడ్డారు.అనేక ఇళ్లు దగ్ధమయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News