Monday, May 6, 2024

కర్నాటక ఫలితాలు నేడే..

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: దేశం యావత్తు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఓట్లు లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. 224 స్థానాలున్న కర్నాటక అసెంబ్లీకి ఈ నెల 10న పోలింగ్ జరగ్గా రికార్డు స్థాయిలో 73.19 శాతం పోలింగ్ నమోదయినట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా శనివారం ఉదయం 8 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 36 కౌంటింగ్ సెంటర్లలో ఓట్ల ఎలక్కింపు ప్రారంభం కానుంది. మధ్యాహ్నానికల్లా ఫలితాలపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం ఏర్పాటుకు ఏ పార్టీకయినా 113 సీట్లు అవసరం. ఇదిలా ఉండగా అధికారం కోసం బిజెపి, కాంగ్రెస్. జెడి(ఎస్)లు నువ్వా, నేనా అన్నట్లుగా పోటీపడిన ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీలయిన కాంగ్రెస్, బిజెపిలలో ఏ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన స్పష్టమైన మెజారిటీ రాకపోవచ్చని, కాంగ్రెస్ కాస్త ముందంజలో ఉండే అవకాశముందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన విషయం తెలిసిందే.

ఈ పరిస్థితుల్లో మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ నేతృత్వంలోని జెడి( ఎస్) మరోసారి కింగ్‌మేకర్‌గా అవతరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఈ నేపథ్యంలో అటు కాంగ్రెస్, ఇటు బిజెపి రెండు పార్టీలోను ఫలితాలపై కాస్త ఆందోళన మొదలయినట్లు కనిపిస్తోంది. ఈ రెండు పార్టీలు కూడా మద్దతు కోసం జెడి(ఎస్)తో తెరవెనుక రాజకీయం సాగిస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నారు. అయితే పైకి మాత్రం రెండు పార్టీల నేతలు తమకు ఎవరి మద్దతు తీసుకోవలసిన అవసరం ఉండదని, తామే సొంత బలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. జెడి(ఎస్)కు ఈ సారి 25నుంచి 30 దాకా స్థానాలు దక్కవచ్చని ఎన్నికల విశ్లేషకుల అంచనా. అంతకన్నా ఎక్కువ సీట్లే వస్తాయని ఆ పార్టీ నేత , మాజీ ముఖ్యమంత్రి హెచ్డి కుమారస్వామి ధీమాగా చెప్తున్నారు. తాము 50 దాకా సీట్లు గెలుచుకుంటామని, కింగ్ మేకర్ కాకుండా తామే కింగ్ అవుతామని పోలింగ్ తర్వాత సింగపూర్ వెళ్లే ముందు కుమారస్వామి చెప్పడం గమనార్హం.

కుమారస్వామి శనివారం నగరానికి తిరిగి వస్తారు. బిజెపి ప్రధాని నరేంద్ర మోడీ చరిష్మా, ప్రచారంపైనే ఎక్కువ ఆశలు పెట్టుకోగా, కాంగ్రెస్ పార్టీ బిజెపి ప్రభుత్వ అవినీతి, ప్రభుత్వంపై ప్రజల అసంతృప్తితో పాటు పార్టీ అగ్రనేతలు సాగించిన ప్రచారంతమకు కలిసి వస్తుందని భావిస్తోంది. మరో వైపు సంప్రదాయంగా తమకు పెట్టని కోటగా నిలుస్తున్న ఒక్కలిగ ఓటు బ్యాంకుతో పాత మైసూరు ప్రాంతంలో పట్టును నిలుపుకోవడంతో పాటుగా అదనంగా మరిన్ని స్థానాలు గెలుచుకుంటామని జెడి(ఎస్) భావిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News