Friday, May 3, 2024

డికె ముందంజ…. కుమారస్వామి వెనుకంజ

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కర్నాటక అసెంబ్లీ ఎన్నిలకల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.  కర్నాటక ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ దూసుకపోతుంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ 111 స్థానాలలో ఆధిక్యంలో ఉండగా బిజెపి 74, జెడిఎస్ 31, ఇతరులు 8 స్థానాలలో లీడ్‌లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్(111) దాటి పోవడంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. సెంట్రల్ కర్నాటక, బెంగళూరు, హైదరాబాద్, ముంబయి కర్నాటకలో, మైసూరులో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది.

కోస్టల్ కర్నాటకలో బిజెపి ముందంజలో ఉంది. ఈ ఎన్నికల ఫలితాలలో ఎనిమిది మంత్రులు వెనుకంజలో ఉన్నారు. బళ్లారి రూరల్‌లో శ్రీరాములు వెనుకంజలో ఉన్నారు. గంగావతిలో గాలి జానార్థన్ రెడ్డి ముందంజలో ఉన్నారు. కనకపూర్‌లో డికె శివ కుమార్ ముందంజలో ఉన్నారు. డికె ఆరు వేల ఓట్లకుపై ఆధిక్యంలో ఉన్నారు. షిగ్గావ్‌లో బస్వరాజు బొమ్మై, వరుణలో సిద్ధరామయ్యలు ముందంజలో ఉన్నారు. రామనగర్‌లో నిఖిల్ కుమారస్వామి, చెన్నపట్టణంలో కుమారస్వామి వెనుకంజలో ఉన్నారు.

Also Read: యూట్యూబ్ రేటింగ్‌కోసం విమానం కూల్చిన వ్యక్తి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News