Friday, April 26, 2024

కశ్మీరీ కుంకుమ ప్రపంచ మెరుపు

- Advertisement -
- Advertisement -

విశేష ఖ్యాతిదాయక జిఐ ట్యాగ్

Kashmir Kumkum recognized by Geographical Index

జమ్మూ : కశ్మీర్ కుంకుమకు ప్రపంచ స్థాయి గుర్తింపు దక్కింది. భౌగోళిక విశేషాల ఖ్యాతి జాబితాలో ఇక్కడ పెరిగే కుంకుమ పువ్వు పంట చేరింది. కశ్మీరీ కుంకుమకు అంతర్జాతీయ స్థాయి భౌగోళిక విశేష సూచీ (జిఐ) గుర్తింపు లభించింది. ఇది జమ్మూ కశ్మీర్‌కు తద్వారా భారత్‌కు విశేష పరిణామమని లెఫ్టినెంట్ గవర్నర్ గిరీష్ చందర్ ముర్మూ తెలిపారు. కశ్మీర్ లోయ పలు అత్యద్భుత ప్రకృతి అందాలకు నెలవు. అంతేకాకుండా ఇక్కడ ప్రపంచంలోనే ఎక్కడా లేని విశేష పంటలు పండుతాయి. ఈ క్రమంలో కశ్మీర్ కుంకుమ పువ్వు అంతర్జాతీయ స్థాయిలో జిఐ గుర్తింపును దక్కించుకుందని ముర్మూ తెలిపారు. ప్రపంచ చిత్రపటంలో ఈ లోయ బ్రాండ్ మార్మోగే దిశలో ఈ గుర్తింపు ఓ చారిత్రక అడుగు అని వివరించారు.

కశ్మీర్‌లో పండే కుంకుమకు జిఐ నమోదును తెలిపే పత్రాన్ని ఇటీవలే కేంద్ర ప్రభుత్వం వెలువరించిందని అధికార ప్రతినిధి ఒకరు శనివారం తెలిపారు. జమ్మూ లెఫ్టినెంట్ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తరువాత ముర్మూ .కుంకుమ పంటకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తేవాలని జిఐ సర్టిఫికెటు అందాలని వ్యక్తిగతంగా కృషి చేశారు. కశ్మీర్‌లో పాంపోర్‌లో అత్యధిక స్థాయిలో ఈ పంట వేస్తారు. లెఫ్టినెంట్ గవర్నర్ తీసుకున్న పలు చర్యలతో, అందించిన ప్రోత్సాహంతో ఈ సారి పంట విశేషరీతిలో ఉంటుందని అధికార ప్రతినిధి ఆశాభావం వ్యక్తం చేశారు. భారతదేశంలో ప్రపంచంలోని ఇతర దేశాలలో కూడా కుంకుమకు ఉన్న అత్యంత ఆదరణను దృష్టిలో పెట్టుకుని ఈ పంట ఉత్పత్తి పెంచేందుకు జాతీయ స్థాయిలో సాఫ్రాన్ మిషన్ (ఎన్‌ఎంఎస్) ఏర్పాటు అయింది. దీనిని ప్రాతిపదికగా చేసుకుని లెఫ్టినెంట్ గవర్నర్ ఎప్పటికప్పుడు ఈ ప్రాం తంలో కుంకుమ పంట ఉత్పత్తిని రెండింతలు మూడింతలు చేసేందుకు పరిశ్రమిస్తున్నారు.

ఎన్‌ఎంఎస్ పరిధిలో రూ 411 కోట్ల నిధులు కేటాయించారు. దాదాపుగా 3715 హెక్టార్లలో ఈ పంటను పండించడం, దీనికి పంటదార్లకు తగు సాయం అందించేందుకు యత్నించేందుకు ఉన్నతస్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. జిఐ ట్యాగ్ రావడంతో ఈ కుంకుమకు ఇకపై అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి రేటు పలుకుతుంది. ఎగుమతులు పెరుగుతాయి.దీనితో కుంకుమ రైతుకు తగు గిట్టుబాటు ధరలు దక్కుతాయని భావిస్తున్నారు. కుంకుమ పంటకు తగు విధమైన ఆధునిక సాగు పద్ధతుల గురించి కూడా లెఫ్టినెంట్ గవర్నర్ కృషి చేస్తున్నారని కేంద్ర వ్యవసాయ శాఖ అధికారి నవీన్ కె చౌదరి కూడా తెలిపారు. స్ప్రింక్లర్ ఇరిగేషన్ వ్యవస్థల కోసం కూడా ఆయన పాటుపడుతున్నట్లు వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News