Tuesday, April 30, 2024

ప్రమాదాలకు నిలయంగా కాసిపేట బైపాస్

- Advertisement -
- Advertisement -

కాసిపేట:పేరుకు రెండు పెద్ద సంస్థలే కాని ప్రమాదకరంగా మారిన రోడ్డును మాత్రం పట్టించుకోవడం లేదు ఫలితం నిత్యం గుంతల్లో పడి ప్రయాణికులు, కాసిపేట గని కార్మికులు, ఓసిసి కార్మికులు గాయ పడుతున్నారు. కాసిపేట బైపాస్ రోడ్డు ముత్యంపల్లి బస్టాండ్, కాసిపేట గని మీదుగా కోమటిచేను, కొండాపూర్ యాప, దేవాపూర్ వరకు ఉంది. బైపాస్ రోడ్డు విషయంలో సింగరేణి, ఓరియంట్ సిమెంట్ కంపెనీ సంయుక్తంగా రోడ్డునిర్వహణలో పాలు పంచుకోవాలని,ఇటు సింగరేణి, అటు ఓరియంట్ సిమెంట్ కంపెనీ కార్మికుల సంక్షేమమే తమకు ముఖ్యం అంటు ఊదరగొట్టె ప్రకటనల ప్రచారాలు చేస్తున్నారే తప్ప కార్మిక సంక్షేమం గాలికి వదిలి వేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిత్యం ఈ రహదారపై ఓరియంట్ సిమెంట్ కంపెనీకి సిమెంట్ కోసం వచ్చి పోయే లారీలు వందల సంఖ్యలోనే ఉంటాయి. అంతేకాకుండా భారీ వాహనాలు కూడా నడుస్తుంటాయి. అలాగే సింగరేణి బొగ్గు టిప్పర్లు, ప్రయాణికులను తీసుకుని వెళ్లి తీసుకొని వచ్చె ఆర్‌టిసి బస్సు, కాసిపేట గనికి, కాసిపేట రెండు గనికి వందలాది మంది కార్మికులు ద్విచక్ర వాహనాలపై వెళ్తుంటారు. అలాగే సోమగూడెం, మందమర్రి, బెల్లంపల్లి నుండి ఓరియంట్‌లో పనులు చేసే కార్మికులు వాహనాలపై ప్రయాణాలు చేస్తుంటారు. ప్రస్తుతం బైపాస్ రోడ్డు ముత్యంపల్లి బస్టాప్ సమీపంలో అధ్వాన్నంగా తయారై పెద్ద, పెద్ద గుంతలు ఏర్పాడ్డాయి, దీంతో నిత్యం వాహనదారులు పడిపోతు గాయాల పాలవుతున్నారు. సూమారు అరకిలో మీటర రోడ్డ అధ్వాన్నంగా మారడంతో ప్రయాణం నరకప్రాయం అవుతుందని వాహనదారులు వాపోతున్నారు. బైపాస్ కావడంతో ఆటోలతో పాటు ఇతర వాహానాలు కూడా ఈ రోడ్డు మీదనే ప్రయాణం చేస్తుంటాయి. ఇటివల రోడ్డ కొరకు కాసిపేట గనిలో కార్మికులు ఆందోళన కూడా చేపట్టారు ఐనప్పటికి ఇటు సింగరేణి, అటు ఓరియంట్ సిమెంట్ కంపెనీ పట్టించుకోక పోవడం విచారకరమని పలువురు అంటున్నారు. ఇప్పటికైన సింగరేణి, ఓరియంట్ సిమెంట్ కంపెనీ స్పందించి బైపాస్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని ప్రయాణికులు ,ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News