Tuesday, April 30, 2024

ప్రస్తుత పరిస్థితుల్లోనే గ్రామాలు బాగుపడాలి: సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

CM KCR

హైదరాబాద్: తెలంగాణలోని పల్లెలన్నీ బాగుపడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్లకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. మంగళవారం ప్రగతి భవన్ లో జిల్లాల కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులతో సిఎం కెసిఆర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ.. అవసరమైన నిధులు, అధికారాలు, కావాల్సిన సిబ్బంది, విధానాలు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలోని పల్లెలన్నీ బాగుపడి తీరాలి. ఇన్ని అనుకూలతలు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో గ్రామాలు బాగుపడాలి. వ్యవసాయ కూలీలకు ఉపాధీ కల్పన, పల్లెల్లో మౌలిక వసతులకు అవసరమైన వ్యూహంతో నరేగా పథకాన్ని వినియోగించుకోవాలి.  ఈ ఏడాది రైతుల భూముల్లో లక్ష కల్లాలు ఏర్పాటు చేయాలి. ప్రతీ గ్రామం ప్రతీ రోజూ శుభ్రం కావాల్సిందే. రెండు నెలల్లో అన్ని గ్రామాల్లో రైతు వేదికలు, వైకుంఠధామాలు పూర్తిచేయాలి. నాలుగేళ్లలో గ్రామాల్లో పనులపై ప్రణాళికలు సిద్ధం చేయాలని సిఎం కెసిఆర్ చెప్పారు.

 CM KCR Meeting with district Collectors at Pragathi Bhavan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News