Wednesday, May 1, 2024

ప్రొఫెసర్ హరగోపాల్‌పై కేసులు ఎత్తివేయాలని కెసిఆర్ ఆదేశం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పౌరహక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్‌పై పెట్టిన దేశద్రోహం కేసును ఎత్తివేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. హరగోపాల్ ఇతర వ్యక్తులపై చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (యుపిఎ) కింద కేసులను ఉపసంహరించుకోవాలని రాష్ట్ర డిజిపిని ఆదేశించారు.

ములుగు జిల్లాలోని తాడ్వాయి పోలీస్ స్టేషన్‌లో గతేడాది ఆగస్టు 19న నమోదైన ఈ కేసులో హరగోపాల్‌తో పాటు మరో 152 మందిపై ఆయుధాల చట్టం, భారత శిక్షాస్మృతి ఉల్లంఘనలతోపాటు పలు అభియోగాలు మోపారు. మావోయిస్టుల డైరీల్లో ఉన్న పేర్ల ఆధారంగా హరగోపాల్‌తో పాటు మరికొందరిని కేసులో చేర్చడంపై ప్రజా సంఘాలు, ప్రతిపక్ష పార్టీల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News