Monday, April 29, 2024

‘కీడాకోలా’ను తప్పకుండా ఎంజాయ్ చేస్తారు: రానా

- Advertisement -
- Advertisement -

తన తొలి రెండు చిత్రాలు ‘పెళ్లి చూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’ బ్లాక్ బస్టర్ విజయాలతో అందరి ప్రసంశలు అందుకున్న యంగ్ అండ్ ట్యాలెంటడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ దాస్యం తన మూడో చిత్రంగా క్రైమ్ కామెడీ మూవీ ‘కీడా కోలా’తో వస్తున్నారు. బ్యాక్-టు-బ్యాక్ హిట్‌లను అందించిన దర్శకుడు న్యూ కమ్మర్స్ తో కలసి హాస్య బ్రహ్మ బ్రహ్మానందం ప్రధాన పాత్రలో ఒక యూనిక్ ఎంటర్ టైనర్ ని ఎంచుకున్నారు. ఇప్పటికే విడుదలైన క్యారెక్టర్ పోస్టర్లు, టీజర్‌తో ఈ సినిమా హ్యుజ్ బజ్ నిక్రియేట్ చేశాయి. ఈరోజు, ఈ చిత్రాన్ని సమర్పిస్తున్న హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు.

తరుణ్ భాస్కర్ కథ-కథనంలో ప్రత్యేకమై శైలి వుంటుంది. ట్రైలర్ కట్ చేయడంలో కూడా తన మార్క్ చూపించారు. కీడా కోలా ట్రైలర్ ఒక క్రేజీ రైడ్. ఇందులో 9 ప్రధాన పాత్రలు వున్న ఈ కథ కీడా, బార్బీ చుట్టూ తిరుగుతుంది. కీడా చుట్టూ కొంత ఉత్కంఠ ఉన్నప్పటికీ అది రివిల్ చేయలేదు, బార్బీ వాల్యూ మిలియన్లు. మిగిలిన ప్రధాన పాత్రలు హిలేరియస్ క్రేజీ ఫన్ రైడ్ ని ప్రజెంట్ చేశాయి.

వరదరాజులు తాతగా బ్రహ్మానందం, వాస్తుగా చైతన్యరావు, లంచంగా  రాగ్ మయూర్, నాయుడుగా తరుణ్, సికిందర్‌గా విష్ణు, జీవన్‌గా జీవన్‌కుమార్, సీఈవోగా రవీంద్ర విజయ్, షాట్స్‌గా రఘురామ్ అందరూ సీరియస్‌గా కనిపించినా వారి యాక్ట్స్ మాత్రం హ్యుమర్ ని తెచ్చిపెట్టింది..అదే కీడా కోలా బ్యూటీ.

ఎజే ఆరోన్ సినిమాటోగ్రాఫర్ అద్భుతంగా ఉంది, వివేక్ సాగర్ తన అద్భుతమైన బీజీఎంతో డిఫరెంట్ మూడ్ ని సృష్టించాడు. ఉపేంద్ర వర్మ ఎడిటింగ్ షార్ప్ గా ఉంది. ఆశిష్ తేజ ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్ కాగా, తరుణ్ భాస్కర్ స్క్రిప్ట్ అందించారు. కె. వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్ నండూరి, శ్రీపాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ నిర్మించిన కీడా కోలా విజి సైన్మ మొదటి ఫీచర్- ఫిల్మ్ గా రూపొందింది. ప్రత్యేకమైన కథ, అద్భుత కథనం తో ట్రైలర్ ఖచ్చితంగా సినిమాని చూడాలనే ఆత్రుతను పెంచింది. కీడా కోలా నవంబర్ 3న విడుదల కానుంది

ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో రానా దగ్గుబాటి మాట్లాడుతూ.. తాము అనుకున్న కథని బలంగా నమ్మి, కథకు కథనానికి కట్టుబడి సినిమాలు తీసే ఫిల్మ్ మేకర్స్ చాలా అరుదుగా వుంటారు. తరుణ్ భాస్కర్ కూడా లాంటి అరుదైన దర్శకుడు. ఒరిజినల్ సినిమాలు చేసే తరుణ్ భాస్కర్ లాంటి ఫిల్మ్ మేకర్ తెలుగు పరిశ్రమలో వుండటం ఒక గౌరవంగా భావిస్తాను. కీడా కోలా చిత్రాన్ని తరుణ్ చూపించినపుడు చాలా నవ్వుకున్నాను. ప్రేక్షకుల కూడా ఎంజాయ్ చేస్తారనే నమ్మకం వుంది. తరుణ్ సినిమాల్లో ఎప్పుడూ చూడని కొత్త నటీనటులని ఇందులో చాలా కొత్తగా చూస్తున్నాం. నవంబర్ 3న సినిమా వస్తోంది. సినిమా చూడండి. తప్పకుండా ఎంజాయ్ చేస్తారు’’అన్నారు.

తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ.. క్రైమ్ కామెడీ నాకు చాలా ఇష్టమైన జోనర్. ఈ జోనర్ లో సినిమా చేయాలని ఎప్పటినుంచో వుండేది. అయితే మొదటి సినిమా ఫ్యామిలీతో వెళ్ళడానికి, అలాగే బడ్జెట్ పరంగా వీలుగా ఉంటుందని పెళ్లి చూపులు, తర్వాత ఈ నగరానికి ఏమైయింది చిత్రాలు చేయడం జరిగింది. కీడా కోలా కథ రాస్తున్నపుడు ఈ జోనర్ ఎంత కష్టమైనదో అర్ధమైయింది. కథ అద్భుతంగా వచ్చింది.

చిత్రీకరణ కూడా చాలా ఎంజాయ్ చేస్తూ చేశాం. ఇందులో చాలా కొత్తదనం వుంటుంది. సినిమా అంతా వినూత్నంగా వుంటుంది. పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైయింది చిత్రాల విషయంలో కొంచెం నెర్వస్ నెస్ వుండేది. కానీ ఈ చిత్రం విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా వున్నాను. ఎడిట్ పదిసార్లు చూశాను. చాలా నమ్మకంగా చెప్పగలుగుతున్నాను. ఫ్యామిలీ,స్నేహితులతో కలసి వెళ్ళండి. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. రానా గారు బావుందని స్టాప్ వేస్తే చాలా మంచి వైబ్ వస్తుంది. చిత్ర నిర్మాతలు నా స్నేహితులే. డబ్బులు పెట్టండి.. వస్తాయని నమ్మకంగా చెప్పాను( నవ్వుతూ). ఇందులో పాత్రలన్నీ వియర్డ్ గా వుంటాయి అందులోనే ఫన్ వుంటుంది. తప్పకుండా అందరూ ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు.

చైతన్య రావు మదాడి మాట్లాడుతూ.. కీడా కోలా గురించి మాటల్లో చెప్పలేను. ఈ సినిమా తర్వాత నన్ను నేను పరిచయం చేసుకునే అవసరం రాదని భావిస్తున్నాను. నాకు అంత ప్రత్యేకమైన చిత్రమిది. తరుణ్ భాస్కర్ గారితో సినిమా చేయాలని నా కల. రానా గారు ఈ సినిమాని ప్రజంట్ చేయడం చాలా ఆనందంగా వుంది. ఆయన పేరు నిలబెట్టుకుంటాం. ఇందులో వాస్తు అనే పాత్ర చేశాను. తప్పకుండా మీకు నచ్చుతుందనే నమ్మకం వుంది. పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైయింది ఎంత ఎంజాయ్ చేశారో దానికంటే పదిరెట్లు ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు

రాగ్ మయూర్ మాట్లాడుతూ.. సినిమా బండితో సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టాను.తరుణ్ ఈ సినిమా అవకాశం ఇచ్చినపుడు నా ఆనందాని హద్దులు లేవు. ఇందులో పాత్రలన్నీ చాలా క్రేజీ గా వుంటాయి. ఇందులో నా పాత్ర పేరు లంచం. సినిమా ఖచ్చితంగా మిమ్మల్ని అలరిస్తుంది’’ అన్నారు

నిర్మాతలు మాట్లాడుతూ..ఈ సినిమా కథ చదివినప్పుడు చాలా ఎంజాయ్ చేశాం. ప్రతి సన్నివేశం క్రేజీ గా అనిపించింది. చాలా మంచి నటీనటులు, టెక్నికల్ టీం ఈ చిత్రానికి పని చేశారు. షూటింగ్ చాలా ఎంజాయ్ చేశాం. సినిమా వండర్ ఫుల్ గా వచ్చింది. నవంబర్ 3న వస్తోంది. అందరూ థియేటర్స్ లో చూడండి. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు’ ’’అన్నారు. ఈ వేడుకలో విష్ణు, జీవన్ కుమార్, రవీంద్ర విజయ్, రఘు రామ్, మిగతా యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News