Friday, April 26, 2024

కశ్మీర్ పండితుల చంపివేతల నేపథ్యంలో కేజ్రీవాల్ 4 డిమాండ్లు

- Advertisement -
- Advertisement -

Arvind Kejriwal

న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ లోయలో ఇటీవల జరిగిన హత్యలకు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు కాశ్మీరీ పండిట్‌లను ప్రభుత్వం అనుమతించడం లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం ఆరోపించారు. జమ్మూ కాశ్మీర్‌లో లక్షిత హత్యలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రానికి వ్యతిరేకంగా దేశ రాజధానిలోని ‘జంతర్ మంతర్’ వద్ద ‘ఆప్’ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో కేజ్రీవాల్ ప్రసంగించారు.

“వారు (కాశ్మీరీ పండిట్లు) లక్షిత హత్యలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నప్పుడు, కాశ్మీర్‌లోని ప్రస్తుత బిజెపి ప్రభుత్వం వారికి  నిరసన తెలియజేయడానికి అనుమతించదు. ప్రభుత్వం ఇలాగే ప్రవర్తిస్తే ప్రజల కష్టాలు రెట్టింపు అవుతాయి’’ అని కేజ్రీవాల్ అన్నారు.  కశ్మీర్ పండితుల విషయంలో బిజెపి  ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు.

కాశ్మీరీ పండిట్‌లకు కేంద్రం సమావేశాలు అక్కర్లేదని, అయితే వారు ఇప్పుడే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారని కేజ్రీవాల్ అన్నారు. “1990 యుగం మళ్లీ వచ్చింది. వారికి (ప్రభుత్వానికి) ఎలాంటి ప్రణాళిక లేదు. లోయలో హత్య జరిగినప్పుడల్లా, హోంమంత్రి అత్యున్నత స్థాయి సమావేశాన్ని పిలిచారని వార్తలు వస్తున్నాయి, ఈ సమావేశాలు సరిపోతాయి, ఇప్పుడు మాకు చర్య కావాలి, కాశ్మీర్ చర్య కావాలి, ”అని ఢిల్లీ సిఎం అన్నారు.

కేజ్రీవాల్ లోయలో జరిగిన లక్షిత హత్యలపై కేంద్రానికి నాలుగు డిమాండ్లు చేశారు – అలాంటి సంఘటనలను ఆపడానికి ఒక కార్యాచరణ ప్రణాళిక, కాశ్మీర్ వెలుపల పని చేయబోమని కశీ్మర్ పండిత్లు సంతకం చేసిన బాండ్లను రద్దు చేయాలి, కాశ్మీరీ పండిట్‌ల డిమాండ్లను నెరవేర్చాలి,  వారికి భద్రత కల్పించాలి. ఈ సందర్భంగా చిన్నచిన్న టాక్టిక్స్ మానుకోవాలని కేజ్రీవాల్ పాకిస్థాన్‌ను హెచ్చరించారు. “కాశ్మీర్ ఎల్లప్పుడూ భారతదేశంలో అంతర్భాగమే” అని నొక్కి చెప్పారు.

జమ్మూ కాశ్మీర్‌లో గత కొన్ని నెలలుగా పౌరుల హత్యలు పెరిగాయి – మూడు నెలల్లో 13 మంది కాల్చి చంపబడ్డారు. ఈ విషయంపై శుక్రవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా,  జమ్మూకాశ్మీర్  లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సింఘా, ఎన్‌ఎస్‌ఎ అజిత్ దోవల్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆప్‌ ఎంపి సంజయ్‌సింగ్‌ మాట్లాడుతూ.. ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ సినిమా పేరుతో ప్రధాని, హోంమంత్రి, కేంద్రమంత్రులు, ఎంపీలందరూ మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆరోపించారు.“ఈరోజు కాశ్మీరీ పండిట్లను ఊచకోత కోస్తున్నారు. మీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రస్తుతం ఎక్కడ దాక్కున్నారని నేను మోడీని అడగాలనుకుంటున్నా’’ అని  సింగ్ ఆక్రోశం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News