Wednesday, May 1, 2024

లవ్ జీహాద్ పిటిషన్‌ను కొట్టేసిన కేరళ హైకోర్టు

- Advertisement -
- Advertisement -

Kerala High Court Rejects Love Jihad petition

తిరువనంతపురం : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేరళ లోని ఒక ‘లవ్ జిహాద్ ’ కేసు కీలక మలుపు తీసుకుంది. ఈ విషయమై వచ్చిన పిటిషన్‌ను విచారించేందుకు కేరళ హైకోర్టు నిరాకరించింది. అంతేకాకుండా “ఆమె ఒక మంచి నిర్ణయం తీసుకుంది. అది ఆమె ఇష్టానికి సంతోషానికి సంబంధించిన విషయం ” అని జిహాద్ అంశాన్ని తీవ్రస్థాయికి తీసుకెళ్తున్నవారికి ఇబ్బందికరమైన సమాధానం చెప్పింది. ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని కోర్టు స్పష్టం చేసింది. జోస్నమేరీ జోసెఫ్ అనే క్రిస్టియన్ మహిళ , షెజిన్ అనే ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లిని వ్యతిరేకిస్తూ మేరీ తండ్రి కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. వారి పెళ్లి లవ్‌జిహాదీ అని, ఆ పెళ్లిని రద్దు చేయాలని కోర్టును అభ్యర్థించారు. ఈ అంశం ఒక్క కేరళ లోనే కాకుండా దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చను లేవనెత్తింది. ఈ పిటిషన్‌పై కోర్టు ముందు మేరీ మాట్లాడుతూ “నేను అతడ్ని ప్రేమించాను. అతనితో జీవించాలని అనుకుంటున్నాను.

అందుకే అతన్ని పెళ్లి చేసుకున్నాను. 18 ఏళ్లు దాటిన వ్యక్తులు ఈ నిర్ణయం తీసుకునే హక్కుంది. మా రెండు కుటుంబాలతో మాట్లాడి వారిని ఒప్పించే ప్రయత్నం చేస్తాం ” అని పేర్కొంది. ఈ విషయమై షెజిన్ స్పందిస్తూ “ నేను మతానికి అతీతుడిని. ఒక వేళ మేరీ క్రైస్తవాన్ని పాటిస్తానని అంటే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అది ఆమె వ్యక్తిగత విషయం. నేను దాంట్లో వేలు పెట్టలేను. అలాగే నాకు సంబంధించిన వ్యక్తిగతమైన అభిప్రాయాల్లో ఆమె కూడా అభ్యంతరం చెప్పదని అనుకుంటున్నాను. ఇది మా చివరి శ్వాస వరకు కొనసాగాలని నా ఆశ. ఎవరికి ఎలా నచ్చితే వారు అలా బతకొచ్చు. ఈ విషయంలో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉండాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News