Saturday, May 4, 2024

హిందూ ఆలయంపై ఖలిస్తానీ రాతలు

- Advertisement -
- Advertisement -

అమెరికాలోని ఆలయంపై మోడీ వ్యతిరేక నినాదాలు

గాంధీనగర్: అమెరికాలో ఒక హిందూ ఆలయాన్ని అపవిత్రం చేసి ఆలయ గోడల పై ప్రధాని నరేంద్ర మోడీ వ్యతిరేక రాతలు రాసిన ఘటనపై కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. భారతదేశం వెలుపల ఉగ్రవాదులకు, వేర్పాటువాద శక్తులకు అటువంటి అవకాశం లభించకూడదని ఆయన అన్నారు. శనివారం నాడిక్కడ రాష్ట్రీయ రక్ష యూనివర్సిటీ మూడవ స్నాతకోత్సవానికి హాజరైన జైశంకర్ అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఆ వార్తలు తాను కూడా చూశానని, అటువంటి ఘటనల పై తాము ఆందోళన చెందుతున్నామని ఆయన అన్నారు. అక్కడి భారత కాన్సులేట్ ఇప్పిటకే ఘటనపై అమెరికా ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిందని, జరిగిన ఘటనపై పోలీసుల నుంచి సమాచారాన్ని తీసుకుందని ఆయన తెలిపారు.

ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతున్నట్లు తాను భావిస్తున్నానని ఆయన తెలిపారు. శ్రీస్వామినారాయణ్ మందిరాంలో విధ్వంసకాండ జరిగినట్లు శుక్రవా రం ఉదయం 8.35 గంటల ప్రాంతంలో తమకు ఫోన్ వచ్చినట్లు కాలిఫోర్నియాలోని నెవార్క్ పోలీసులు తెలిపారు. సోషల్ మీడియాలో కనిపించిన ఫోటోల ప్రకారం ఆలయం వెలుపల ఉన్న సైన్‌బోర్డుపై ఖలిస్తాన్ అన్న రాతలతోపాటు ఆలయ గోడలపై అభ్యంతరకర రాతలు ఉన్నా యి. విద్వేషంతో కాని పక్షపాతంతోకాని బెదిరింపులకు, హింసకు, ఆస్తుల ధ్వంసానికి, వేధింపులకు లేదా నేరాలకు పాల్పడితే తీవ్రంగా పరిగణిస్తామని నెవార్క్ పోలీసులు తెలిపారు. ఆలయాన్నిఅపవిత్రం చేసిన ఘటనను శా న్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరల్ తీవ్రంగా ఖండించింది. అ మెరికాలో నివసిస్తున్న ఖలిస్తానీ వేర్పాటువాది గుర్‌పట్వంత్ సింగ్ పన్నున్‌ను హత్య చేయడానికి ఒక భాతతీయ అధికారితో కలసి కుట్రపన్నారన్న ఆరోపణపై జెక్ రిపబ్లిక్‌లో నిఖిల్ గుప్తా అనే భారతీయుడిని అరెస్టు చేయడం గురించి జైశంకర్ మాట్లాడుతూ ఆ దేశంలో భారతీయ ఎంబసీ ద్వారా గుప్తాకు న్యాయ సహాయాన్ని అందచేసినట్లు చెప్పారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News