Sunday, April 28, 2024

నేను ఆ టైప్ కాదు

- Advertisement -
- Advertisement -

Kiara Advani Play Bold Role in Indoo Ki Jawani

బాలీవుడ్‌లో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ కియారా అద్వానీ. ‘అర్జున్ రెడి’్డ హిందీ రీమేక్ ‘కబీర్ సింగ్’ తర్వాత కియారా కెరీర్ పూర్తిగా టర్న్ అయింది. బాలీవుడ్‌లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా మారింది ఈ బ్యూటీ. ఇటీవల ఆమె ‘ఇందూకి జవానీ’ సినిమా చేసింది. ఈ సినిమాలో మరీ బోల్డ్ అమ్మాయిగా నటించింది. డేటింగ్ యాప్స్‌ను నమ్మి మోసపోయే అమ్మాయి పాత్రలో కియారా కనిపించింది. ఈతరం అమ్మాయిలు మరీ ఇలా తయారయ్యారా… అనిపించేలా ఆ పాత్ర ఉంటుంది. మరి కియారా ఎలాంటి అమ్మాయి? అంటూ ఈ సమయంలో చాలా మంది నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో కియారా క్లారిటీ ఇచ్చింది. “ఇందూకి జవానీ సినిమాలో నటించినా కూడా నేను ఇందూ టైప్ అస్సలు కాదు. ఇందూ ఈ తరం రొమాంటిక్ లైఫ్‌స్టైల్ కలిగి ఉన్న అమ్మాయి. కానీ నా రొమాంటిక్ లైఫ్‌స్టైల్ మాత్రం చాలా ఓల్డ్. నా రొమాంటిక్ ఆలోచనలు అన్నీ కూడా ఓల్డ్‌గా ఉంటాయి. డేటింగ్ యాప్స్ వరకు నేను వెళ్లాలనుకోవడం లేదు”అని పేర్కొంది కియారా.

Kiara Advani Play Bold Role in Indoo Ki Jawani

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News