Sunday, April 28, 2024

చిరుత సంచారంపై అటవీశాఖ వివరణ

- Advertisement -
- Advertisement -

Forest Department Explanation on Leopard Wandering

హైదరాబాద్: గచ్చిబౌలి ఐటి కారిడార్ లో చిరుత సంచరిస్తుందన్న వార్తలపై అటవీశాఖ వివరణ ఇచ్చింది. రోడా మిస్త్రీ కళాశాల సమీపంలో చిరుత కనిపించిందన్న స్థానికుల ఫిర్యాదు మేరకు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటివరకు చిరుత జాడ కనిపించలేదని తెలిపారు. ట్రాప్ కెమెరా దృశ్యాల్లో కుక్కలు, కోతులు మాత్రమే కనిపించాయి. మరికొన్ని రోజులు ట్రాప్ కెమెరాలతో నిఘా కొనసాగిస్తామని ఫారెస్ట్ అధికారులు వెల్లడించారు. గచ్చిబౌలిలో చిరుత సంచారం కలకలం రేపింది. బయోడైవర్సిటీ చౌరస్తాలోని చిరుత కుక్కను ఎత్తుకెళ్లింది. చిరుత కాలేజీ పక్కన గుట్టల్లోకి వెళ్లినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. చిరుత తిరుగుతుందన్న వార్త స్థానిక ప్రజలను భయపెడుతోంది.

Forest Department Explanation on Leopard Wandering

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News