Monday, May 13, 2024

పాక్‌లో తాలిబన్ నేతకు టేకిటీజీ ఎల్‌ఐసి పాలసీ..

- Advertisement -
- Advertisement -

ఇస్లామాబాద్: అఫ్ఘన్ తాలిబన్ అధినేత ముల్లాఅక్తర్ మన్సౌర్ పాకిస్థాన్‌లో ఎల్‌ఐసి బీమా పాలసీ దక్కించుకున్నారు. అది కూడా నకిలీ పత్రాలను పొందుపర్చి దీనిని పొందినట్లు వెల్లడైంది. అమెరికా సేనల డ్రోన్ దాడులలో హతం కావడానికి ముందే రూ.3 లక్షల ప్రీమియం చెల్లించాడు. 2016 మే 21వ తేదీన పాకిస్థాన్ ఇరాన్ సరిహద్దుల వెంబడి మన్సౌర్‌ను వెంటాడి అమెరికా సేనలు డ్రోన్ల దాడిలో చంపేశాయి. 2013లో మృతి చెందిన తాలిబన్ వ్యవస్థాపకులు ఒంటికన్ను , పరారీలో ఉన్న ఆధ్యాత్మిక నేత ముల్లా మెహమ్మద్ ఒమర్ నుంచి మన్సౌర్ తాలిబన్ బాధ్యతలు తీసుకున్నారు. పాకిస్థాన్‌లో మన్సౌర్ అక్రమ పద్ధతులలో బీమా పాలసీ పొందిన వివరాలు ఇప్పుడు వెల్లడయ్యాయి.

మన్సౌర్, తప్పించుకుని తిరుగుతున్న ఆయన సహచరులకు వ్యతిరేకంగా ఉన్న ఉగ్ర నిధుల చేరవేత కేసు విచారణ దశలో ఈ బీమా పాలసీ విషయాలు వెలుగులోకి వచ్చాయి. కరాచీలోని యాంటీ టెర్రరిస్టు కోర్టు ముందు బీమా కంపెనీ వివరాలు పొందుపర్చింది. నకిలీ తప్పుడు పత్రాల ఆధారంగా మన్సౌర్ పాకిస్థాన్‌లోని కరాచీలో పలు చోట్ల ఆస్తులు కొనుగోలు చేశాడు. తమకు మన్సౌర్ బతికుండగా చెల్లించిన ప్రీమియం మొత్తం రూ.3 లక్షలను చెల్లిస్తామని బీమా కంపెనీ తెలియచేసుకుంది. వెంటనే ఓ చెక్కు అందించింది. దీనిని ప్రభుత్వ ఖజానాలో జమ చేయవచ్చునని కోర్టుకు తెలియచేసుకుంది.

Afghan Taliban leader bought LIC policy in Pakistan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News