Sunday, May 12, 2024

తెలంగాణ సిఐడి పోలీసులకు సిఆర్‌పి శిక్షణ అందించిన కిమ్స్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్: ప్రజా భద్రతను పెంపొందించడంలో కీలక ముందడుగులో భాగంగా నగరంలోని కిమ్స్ ఆసుపత్రి వైద్యులు తెలంగాణ సిఐడి పోలీసుల కోసం ప్రత్యేకంగా కార్డియోలో సరీ రీనిసిటేషన్ (సిపిఆర్ )పై అవగాహన సదస్సును నిర్వహించారు. ఆకస్మికంగా గుండెపోటు వచ్చినవారికి తిరిగి ప్రాణాలు పోయడానికి ఉపయోగపడే ప్రాణరక్షణ టెక్నిక్ అయిన సిపిఆర్ చేయడంలో కావల్సిన పరిజ్ఞానం, నైపుణ్యాలను వివిధ స్థాయుల్లో ఉండే పోలీసు సిబ్బందికి డాక్టర్లు వివరించారు. ఈ సందర్భంగా సీనియర్ కార్డియాలజిస్టు, కోర్సు డైరెక్టర్ డాక్టర్ బి. హయగ్రీవరావు మాట్లాడుతూ సిపిఆర్ మీద అవగాహన, శిక్షణ అవసరం ప్రస్తుత కాలంలో చాలా ఎక్కువగా ఉందని మన దేశంలో ప్రతియేటా సుమారు 7 లక్షల మంది గుండెపోటు వల్ల మరణిస్తున్నారని పేర్కొన్నారు. అప్పటికీ గుండెవ్యాధులు ఉన్న వారికే కాకుండా ఎవరికైనా ఎప్పుడైనా గుండెపోటు రావచ్చని.. అది వచ్చినప్పుడు సమయం చాలా కీలకమని సూచించారు.

మెదడులోని కణాలు 4-6 నిమిషాల నుంచి అంతరించడం మొదలవుతుందని ఆ తర్వాత ప్రతి నిమిషం ఆలస్యమయ్యే కొద్దీ బతికే అవకాశాలు 10శాతం చొప్పున తగ్గిపోతుంటాయని తెలిపారు. అనంతరం ఆసుపత్రి ఎండి డాక్టర్ బి.భాస్కరరావు వివరిస్తూ సిపిఆర్ శిక్షణ కార్యక్రమాలు ఇవ్వడానికి తమ సంస్థ ఎప్పటికీ కట్టుబడి ఉంటుందని చెప్పారు. ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు, సిఐఎస్‌ఎఫ్ సిబ్బంది, సాధారణ ప్రజానీకానికి రాము ఈ తరహా శిక్షణ ఇచ్చామని ఆయన వివరించారు. తమ వద్ద శిక్షణ పొందినవారిలో కొందరు చుట్టుపక్కల వారి ప్రాణాలు కాపాడిన సందర్భాలను ఆయన వివరించారు. మరింత ఎక్కువ మందికి సిపిఆర్ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు.ముఖ్య అతిధిగా పాల్గొన్న తెలంగాణ సిఐడి అదనపు డైరెక్టర్ జనరల్ మహేష్ దగవత్ ఈ సందర్భంగా తమ సిబ్బందికి, అధికారులు అందరికీ సిపిఆర్ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు కిమ్స్ ఆస్పత్రికి తమ కృతజ్ఞతలు తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో గుండెపోటు వచ్చినవారి ప్రాణాలు కాపాడటంతో పోలీసుల పాత్రను గుర్తించినందుకు ధన్యవాదాలు చెప్పారు. తమ శాఖలో ఇలాంటి ప్రాణరక్షణ టెక్నిక్లలను అమలు చేయడం వెంటనే మొదలుపెడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 150 మంది వరకు సిబ్బంది, అధికారులు పాల్గొని విజయవంతంగా శిక్షణ పొందారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News