Saturday, May 4, 2024

‘టాక్ టు టైప్’ ఫీచర్‌ను ప్రారంభించిన ‘కూ’

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ కూ తాజాగా టాక్ టు టైప్ ఫీచర్‌ను ప్రారంభించింది. తమ ఆలోచనలను పంచుకోవాలనుకునే వారు ఎవరైనా ఇప్పుడు టైప్ చేయకుండా సులభంగానే పంచుకునే వీలు కల్గుతుంది. కీబోర్డ్ ఉపయోగించకుండా ఒక బటన్ క్లిక్ చేసి మాట్లాడితే చాలు పదాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. కూ ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్ని భారతీయ భాషలలో ఈ ఫీచర్ తీసుకొచ్చింది. స్థానిక భారతీయ భాషలలో ప్రజలు ఆలోచనలను పంచుకోవడానికి ఇది సులభమైన మార్గంగా సంస్థ చెబుతోంది. ఈ ‘టాక్ టు టైప్‘ ఫీచర్‌ని ఉపయోగిస్తున్న ప్రపంచంలోని మొట్టమొదటి సోషల్ మీడియా ప్లాట్‌ఫాం కూ, అది కూడా ఇంగ్లీష్ కాకుండా భారతీయ ప్రాంతీయ భాషలను కూడా అందిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News