Wednesday, May 1, 2024

ముండ్ల చెట్టుకు నీళ్లు పోస్తే పండ్లు వస్తాయా: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

మిర్యాలగూడః ముండ్ల చెట్టుకు నీళ్లు పోస్తే పండ్లు ఎలా వస్తాయని టిఆర్‌స్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. సోమవారం సాయంత్రం రోడ్‌షో హనుమాన్ పేట బైపాస్‌ నుండి శకుంతల టాకీస్ బస్టాండ్ సెంటర్, కెఆర్ స్టేట్ మీదుగా రాజీవ్ చౌక్ వరకు భారీ జన సమూహంతో కోలాట బృందాలతో నడిచింది. సాగర్ రోడ్డు మొత్తం గులాబి మయంగా మారింది. కెటిఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చీకటి రాజ్యంగా నడిచిందని విమర్శించారు. రేవంత్‌రెడ్డి , కోమటిరెడ్డికి తెలంగాణలో 24గంటలు కరెంటు కనిపించడంలేదా అన్ని ప్రశ్నించారు. తెలంగాణలో 24గంటల కరెంటు ఇస్తుంటే కాంగ్రెస్ వారికి కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. 11సార్లు అధికారం ఇచ్చినా వారు ఏమాత్రం అభివృధ్ది చేయలేదని, ధరణి రద్దు చేస్తా, గ్రామాలలో పట్వారి వ్యవస్థను తీసుకొస్తాం అంటున్న వాళ్లకు రైతుల బాధలేవీ లేవని ఆయన విమర్శించారు. మిర్యాలగూడ కళకళలాడుతుందంటే వ్యవసాయం బాగున్నట్టే కదాఅని అన్నారు.

నల్లగొండలో వరి ధాన్యం ఉత్పత్తిలో నెంబర్ వన్‌గా ఉందని ఈ రాష్ట్రాన్ని అసమర్థుల చేతిలో పెడదామా అన్నారు. అన్ని కులాల, మతాలవారు అన్నదుమ్ముల్లా బతుకుతున్నామని , వారి మద్య వైరం సృష్టించి లబ్ది పొందాలని కొన్ని మత తత్వ శక్తులు వస్తున్నాయని వారందరికి బుద్ది చెప్పాలన్నారు. కెసిఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అయిన తరువాత ఎమ్మెల్యే భాస్కర్‌రావు అయ్యాక కొత్త పథకాలు పెడతాం, దేశానికి అన్నం పెట్టే మన తెలంగాణను విద్రోహశక్తుల చేతికి ఇవ్వవద్దని అన్నారు. . ప్రతి గ్రామంలో మహిళా సమైక్య భవనాలు కట్టిస్తామని, దామరచర్లలో యాదాద్రి పవన్ ప్లాంట్ నిర్మిస్తున్నామని, దీని ద్వారా 10వేల మందికి పైగా ఉద్యోగాలు వస్తాయని , 20వేలు పరోక్షంగా పొందుతారన్నారు. కెసిఆర్ ప్రభుత్వం మూడోసారి వచ్చిన తరువాత కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామని , దాంట్లో భాగంగా మిర్యాలగూడ జిల్లాగా ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు.

ఇవన్ని జరగాలంటే కారుగుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. రోడ్‌షోలో బిఆర్‌ఎస్ అభ్యర్థి నల్లమోతు భాస్కర్‌రావు, రాష్ట్ర అగ్రో చైర్మన్ విజయ సింహారెడ్డి డిసిఎంఎస్ చైర్మన్ నారాయణరెడ్డి, మిర్యాలగూడ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ బైరం బుచ్చయ్య, మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, ఎన్బిఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిధ్దార్థ, జడ్పిటిసిలు, ఎంపిపిలు, సర్పంచులు, ఎంపిటిసిలు , కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News