Tuesday, May 7, 2024

ఆపద్బాంధవుడు

- Advertisement -
- Advertisement -

ktr

 

ఆపత్కాలంలో ఆనందకర వార్త

11 మంది కరోనా రోగులకు తాజా పరీక్షలో నెగిటివ్
అందుబాటులోకి కింగ్ కోఠి ఆసుపత్రి, అన్నపూర్ణ క్యాంటీన్లలో 30వేల మంది ఫ్రీగా భోజనం చేశారు
కూలీల కడుపు మాడ్చం
ట్విట్టర్‌లో మంత్రి కెటిఆర్

కరోనా కష్టకాలంలో సామాన్యుల ట్వీట్లకు తక్షణమే స్పందిస్తున్న మంత్రి

మహారాష్ట్రలో ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న
ఓ వ్యక్తి తన తల్లి కడచూపునకు సాయం
ఆర్‌జెడి నేత తేజ్‌ప్రతాప్ వినతికి స్పందించి బీహార్ కూలీల ఆకలితీర్చిన నేత
ఈశాన్య రాష్ట్రాలకు చెందిన పలువురు వలసదారులకు భరోసా

మన తెలంగాణ/హైదరాబాద్ : పలు రాష్ట్రాల ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు తమ వారికి సాయం చేయాలంటూ మంత్రి కెటిఆర్‌కు ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేశారు. వారి ట్వీట్లకు వెంటనే కెటిఆర్ సమాధానం ఇస్తూ వారు చేసిన విజ్ఞప్తుల చర్యలు తీసుకోవాలని తన సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఆదివారం పలువు రు మంత్రి కెటిఆర్‌ను సాయం కోరుతూ ట్వీట్ చేశారు. ఈ కోవలోనే… తన తల్లి చనిపోయింది, చివరిచూపు చూసుకోవడానికి అనుమతి కావాలంటూ ఓ ప్రిన్సిపాల్ చేసిన విజ్ఞప్తికి మంత్రి కెటిఆర్ వెంటనే స్పందించారు. తగిన ఏర్పాట్లు చేయాలని తన కార్యాలయ సిబ్బందికి ఆదేశాలు జారీ చేసి మంత్రి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు.

దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే…మహారాష్ట్రలోని ఓ కళాశాలలో తెలంగాణకు చెందిన వ్యక్తి ప్రిన్సిపల్‌గా పని చేస్తున్నారు. ఆదివారం ఉదయం తన తల్లి చనిపోయిందని, ఆమె చివరి చూపు దక్కించుకోవాలంటే తనను తెలంగాణలోకి వచ్చేలా అనుమతించాలని, లాక్‌డౌన్ నేపథ్యంలో తన ప్రయాణానికి ఎవరూ ఆటంకం కల్గించకుండా ఉండేలా చూడాలని మంత్రి కెటిఆర్‌కు ఆయన విజ్ఞప్తి చేస్తూ ఓ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై స్పందించిన కెటిఆర్, సదరు ప్రిన్సిపల్ తల్లి మృతిపై విచారం వ్యక్తం చేయడంతో పాటు ఆ ప్రిన్సిపల్‌ని రాష్ట్రంలోకి అనుమతించేలా వెంటనే చర్యలు చేపట్టాలని తన సిబ్బందిని ఆదేశించారు. మహారాష్ట్రలోని చంద్రాపూర్‌లో ఉన్న జనతా మహా విద్యాలయలో ప్రిన్సిపాల్‌గా డాక్టరు సుభాష్ పనిచేస్తున్నారు.

బీహార్ వలస కూలీల ఆకలి తీర్చిన నేత
లాక్‌డౌన్ కొనసాగుతుండటంతో హైదరాబాద్‌లో కూలీ పనుల నిమిత్తం పలు రాష్ట్రాల నుంచి ఇక్కడకు వలస వచ్చిన కూలీలు చాలా మందే ఇక్కడే ఉండిపోయారు. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలకు సంబంధించిన ప్రముఖులు దీనిని తమ వంతు బాధ్యతగా తీసుకుంటున్నారు. ఈ మేరకు తెలంగాణ మంత్రి కెటిఆర్‌కు తమ ట్వీట్ల ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ క్రమంలో బీహార్ మాజీ మంత్రి, రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) నేత తేజ్ ప్రతాప్ యాదవ్ కూడా మంత్రికి ఓ ట్వీట్ చేశారు. హైదరాబాద్, జూబ్లీహిల్స్ లో పరిధిలోని వెంకటగిరిలో బీహార్ నుంచి వలస వచ్చిన 20 మంది కూలీలు చిక్కుకు పోయా రని, వారికి ఆహారం అందేలా చూడాలంటూ ఆయన కెటిఆర్‌కు ట్వీట్ చేశారు. ఆ కూలీల పేర్ల జాబితాను ఈ పోస్టులో మాజీ మంత్రి తేజ్‌ప్రతాప్ జతపరిచారు. ఈ పోస్ట్‌పై కెటిఆర్ వెంటనే స్పందించారు. వారిని తాము జాగ్రత్తగా చూసుకుంటామని బదులిచ్చారు. ఈ మేరకు మంత్రి కెటిఆర్ తగిన ఏర్పాట్లు చేయాలని తన కార్యాలయం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

చర్యలు చేపట్టాలని మేడ్చల్ కలెక్టర్ ఆదేశం
అదే విధంగా, మేడ్చల్ జిల్లాలో ఒడిశాకు చెందిన వలస కూలీలు కూడా లాక్ డౌన్ కారణంగా ఆహారం లేక ఇబ్బంది పడుతున్నారని, దయచేసి వారికి సాయపడాలని ఓ ట్వీట్ ద్వారా కెటిఆర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై చర్యలు చేపట్టాల్సిందిగా మేడ్చల్ కలెక్టర్‌కు సూచనలు చేశారు. గచ్చిబౌలిలో చిక్కుకున్న వారిని జాగ్రత్తగా చూసుకుంటున్నాం. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన 15 మంది గచ్చిబౌలిలో చిక్కుకుపోయారని, వారికి ఆహారం అందజేయాలని ఇంకో ట్వీట్‌లో కెటిఆర్‌ను కోరగా, వారిని తాము జాగ్రత్తగా చూసుకుంటామని బదులిచ్చారు.

 

KTR who responds immediately to common man tweets
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News