Thursday, May 16, 2024

అత్యవసర సేవకులకు జయహో

- Advertisement -
- Advertisement -

mp-santhosh-kumar

 

కరోనా యుద్ధ సైన్యానికి వందనాలు
రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్

మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్ కారణంగా అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న వారికి ఎంపి సంతోష్‌కుమార్ ధన్యవాదాలు తెలిపారు. వైద్యులు, పోలీసులు, శానిటరీ వర్కర్స్, జర్నలిస్టులు, డెలివరీ బాయ్స్, విద్యుత్ కార్మికులు అద్బుతంగా సేవలంది స్తున్నారని ఆయన కొనియాడారు. వీరి సేవలు చిర కాలం చరిత్రలో నిలిచిపోతాయని, ప్రజలు అత్యవసర పరిస్థితులు గమనించి అవగాహనతో ఇంటికే పరిమి తం కావాలని ఎంపి కోరారు. దేశంలో అత్యవసర సేవ లు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలంతా ఇంటికే పరిమితమైన ఈ క్లిష్ట సమయంలో అంతరాయం లేకుండా 24గంటలు విద్యుత్‌ను మనకు సరఫరా చేస్తున్న విద్యుత్ ఉత్పత్తి, సరఫరా సంస్థల సిబ్బందిని ఆయన కొనియాడారు.

ఒకవేళ విద్యుత్ సిబ్బంది విధులకు హాజరు కాకుండా ఉంటే మన పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఈ విషయాన్ని ప్రజలు ఆలోచించాలని ఆయన చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో పంటలు చివరిదశలో ఉన్న ప్రస్తుత సమ యంలో విద్యుత్ సరఫరా లేకపోతే నీరు అందక, పంట లు పండగా రైతులకు ఊహించని రీతిలో నష్టం జరిగేద న్నారు. లాక్‌డౌన్ నుంచి విధులు నిర్వహిస్తున్న పోలీసు, డాక్టర్లు, పారిశుద్ధ కార్మికులతో పాటు కనిపించకుండా తమ విధులను నిర్వహిస్తున్న విద్యుత్ కార్మికులను కూడా మనం అభినందనలు తెలపాలని ఆయన పేర్కొ న్నారు. ఇంత వేసవికాలంలో కూడా విద్యుత్ అంత రాయం లేకుండా నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్నా రంటే మన ముఖ్యమంత్రి కెసిఆర్ ముందు చూపుతో చేసిన ప్రణాళికల వల్ల సాధ్యమైందన్నారు.

సొంతవైద్యం అత్యంత ప్రమాదకరం
సోంత వైద్యం అత్యంత ప్రమాదరకమైందని రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ హెచ్చరించారు. సొంతవైద్యంతో అనేక ప్రమాదాలున్నాయని ఆయన ట్విట్టర్‌లో ఆందోళనవ్యక్తం చేశారు.కోవిద్-19 (కరోనా) లక్షణాలకు సొంతవైద్యం తీసుకోవడంతో ఏమాత్రం ప్రయోజన ఉండక పోగా ప్రమాదరమని ఆయన హెచ్చరించారు. జ్వరం, దగ్గు,శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటే వెంటనే వైద్యున్ని సంప్రదించాలని ఆయన చెప్పారు. లేదా ప్రభుత్వం సూచించిన హెల్ప్‌లైన్ నంబర్లకు కాల్ చేసి సమాచారం పొందవచ్చని తెలిపారు. కరోనా వ్యాప్తి నివారణకు ప్రజలందరూ సామాజిక దూరం పాటించాలని ఎంపి సంతోష్ కుమార్ చెప్పారు. అలాగే స్వీయ నియంత్రణ పాటించి కరోనాను తరిమివేయాలని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

 

Thanks for emergency servicers
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News