Thursday, May 16, 2024

సరిహద్దులు క్లోజ్

- Advertisement -
- Advertisement -

Boundaries

 

లాక్‌డౌన్ సమయంలో ఉద్యోగులు, కూలీలకు తప్పనిసరి వేతనం చెల్లించాలి
భూస్వాములు కౌలు పైసల కోసం ఒత్తిడి చేయొద్దు
నెల రోజుల పాటు ఓనర్లు ఇంటి అద్దెలు అడగొద్దు.. అడిగి వేధిస్తే విచారణ ఎదుర్కొనాల్సి ఉంటుంది

సరకు రవాణాకే అనుమతి
వలస కార్మికులను 14 రోజులు క్వారంటైన్లలో ఉంచాల్సిందే
అందుకోసం హైవేల పక్కనే షెల్టర్లు ఏర్పాటు చేయండి
వ్యక్తిగత బాధ్యత తీసుకొని అమలు చేయండి
రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు

న్యూఢిల్లీ: కరోనా వైరస్ నేపథ్యంలో లాక్‌డౌన్ కారణంగా పనులు లేక తమ రాష్ట్రాలకు తరలి వెళ్తున్న వలస కార్మికులను ఆ యా రాష్ట్రప్రభుత్వాలు 14 రోజులు క్వార ంటైన్‌లో ఉంచాలని కేంద్ర ప్రభుత్వం సూ చించింది. ఆదివారం వివిధ రాష్ట్రాల ప్ర ధాన కార్యదర్శులు, డిజిపిలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్ర క్యాబినెట్‌క్రార్యర్శి రాజీవ్ గౌబా, హోం కార్యదర్శి అజయ్ భల్లా ఈ మేరకు సూచనలు చేశారు. లాక్‌డౌన్ నిబంధనల ను కచ్చితంగా అమలు చేస్తూ, కూలీలు నగరాలు, రాష్ట్ర సరిహద్దులను దాటి వెళ్లకుండా సరిహద్దులను మూసి వేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ‘దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వలసకార్మికులు పెద్ద సంఖ్యలో స్వస్థలాలకు తరలి వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. జిల్లా, రాష్ట్ర సరిహద్దులను పటిష్టంగా మూసి వేయాలంటూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది’ అని ఒక అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. నగరాలలోపల, అలాగే జాతీయ రహదారుల వెంబడి ప్రజలు ఇష్టారాజ్యంగా తిరగకుండా చేడాలని, లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది.

సరకుల వాహనాలను మాత్రమే అనుమతించాలని స్పష్టం చేశారు. వీలయినంతవరకు జాతీయ రహదారుల పక్కనే క్వారంటైన్‌లను ఏర్పాటు చేయాలని రాజీ వ్ గౌబా కోరారు. అయి తే ఇప్పటికే తమ సొంత ప్రాంతాలకు పయనమైన వలస కూలీలను వారు స్వస్థలాలకు చేరగానే ఆయా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని క్వారంటైన్‌లకు తరలించి కనీసం 14రోజుల పాటు ఉంచాల ని స్పష్టంచేశారు. ఇలా చేయడంవల్ల కరోనా వైర స్ వ్యాప్తి చెందకుండా నివారించవచ్చని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులు వ్యక్తిగతంగా బాధ్యత తీసుకొని ఈ నిబంధనలు అమలయ్యేలా చూడాలని కేంద్రం ఆదేశించింది. అనంతరం హోంశాఖ సంయుక్త కార్యదర్శి పుణ్య సలిల శ్రీవాస్తవ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, లాక్‌డౌన్‌ను ఉల్లంఘించి ప్రయాణాలు చేసిన వలస కార్మికులను వారి స్వస్థలాల్లో 14 రోజులు క్వారంటైన్‌లో ఉంచాలని ఆదేశించినట్లు చెప్పారు.

ఇందుకోసం షెల్టర్లు ఏర్పాటు చేయాలని, హెల్త్ వర్కర్లను సిద్ధం చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించినట్లు ఆమె చెప్పారు. వల స కూలీలతో పాటుగా నిరాశ్రయులైన పేదలకు నీడ, ఆహారం అందించడానికి వీలుగా తగిన ఏర్పాట్లు చేయాలని కేంద్ర అధికారులు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు, పోలీసు చీఫ్‌లను ఆదేశించారు. వలస కార్మికులు స్వస్థలాలకు చేరకున్న వెంటనే అందరినీ 14 రోజుల పాటు క్వారంటైన్ కేంద్రాలకు తరలించాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కూడా ప్రతి జిల్లా సరిహద్దుల్లో క్వారంటైన్ సెంటర్లను ఏర్పాటుచేసి వలస కార్మికులను మొదట అక్కడికి తరలించాలన్నారు.

ఇంటి అద్దెలపై ఒత్తిడి తెచ్చే యజమానులపై చర్యలు
అలాగే ఇంటి అద్ద్దెల కోసం యజమానులు ఎవరైనా ఒత్తిడి తెస్తే వారిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర క్యాబినెల్ కార్యదర్శి గౌబా రాష్ట్రాల అధికారులకు సూచించారు. అద్దెకున్న వారితో ఇంటి యజమానులు సహకరించాలని ఆయన కోరారు.

 

Boundaries are closed
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News