Tuesday, April 30, 2024

పది మీటర్ల దూరంలో కూలీలు…

- Advertisement -
- Advertisement -

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్రం సిల్‌క్యారా సొరంగంలో 41 మంది కార్మికులు చిక్కుకపోవడంతో వాళ్లను బయటకు తీసేందుకు సహాయక చర్యలు చేపట్టారు. వాళ్లు సొరంగంలో 60 మీటర్ల దూరంలో ఉండడంతో 50 మీటర్ల దూరం వరకు సమాంతరంగా తవ్వకాలు పూర్తి చేశారు. మరో పది మీటర్లు తవ్వితే కూలీలు వద్దకు చేరుకోవచ్చు. ఆగర్ యంత్రంలో డ్రిలింగ్ చేస్తే 47 మీటర్ల వద్ద అది విరిగిపోవడంతో మధ్యలోనే చిక్కుకుపోయింది. సమాంతరంగా తవ్వకాలు పూర్తి చేసిన తరువాత 800 మిమీ వ్యాసం ఉన్న పైపులను మెల్లగా సొరంగంలోకి ప్రవేశపెడుతామని అధికారులు వెల్లడించారు.

కొండ పైనుంచి కూడా కూలీల వద్ద గల దూరం 86 మీటర్లుగా గుర్తించారు. ఇప్పటికే 42 మీటర్లు పూర్తి కావడంతో దాదాపుగా సగం పూర్తి చేశారు. 44 మీటర్లు డ్రిల్ చేస్తే అక్కడి చేరుకోవచ్చు కానీ 1.2 మీటర్ల వెడల్పు గొట్టం ద్వారా ప్రవేశ పెడుతున్నారు. 16 రోజుల క్రితం కూలీలు సొరంగంలో చిక్కుకపోయారు. ఎండోస్కోపి తరహాలోని కెమెరాను పంపి వారి మాట్లాడడంతో పాటు వారికి వాకీటాకీలను పంపించి దైర్యం చెబుతున్నారు. చిన్న గొట్టాల ద్వారా ఆహారం, పానీయాలను పంపిస్తున్నారు. కూలీలంతా సురక్షితంగా ఉన్నారని అధికారులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News