Sunday, April 28, 2024

మీ డబ్బు సురక్షితం

- Advertisement -
- Advertisement -
Lakshmi Vilas Bank says your money is safe
బ్యాంకు వద్ద తగినంత నగదు ఉంది. గడువుకు ముందే డిబిఎస్‌తో విలీనం. బ్యాంక్ నిర్వాహకుడు డిపాజిటర్లకు భరోసా

న్యూఢిల్లీ : డిపాజిటర్లకు చెల్లించేందుకు బ్యాంక్ వద్ద తగినంతగా నిధులు ఉన్నాయని ఆర్‌బిఐ (భారతీయ రిజర్వ్ బ్యాంక్) నియమించిన లక్ష్మి విలాస్ బ్యాంక్ అడ్మినిస్ట్రేటర్ టిఎన్ మనోహరన్ తెలిపారు. బ్యాంక్ డిపాజిటర్ల డిపాజిట్లు పూర్తిగా సురక్షితంగా ఉన్నాయని, వారు భయపడాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు. లక్ష్మి విలాస్ బ్యాంక్‌ను డిబిఎస్ ఇండియాతో విలీనం చేయడం వేగవంతం అవుతుందని పేర్కొన్నారు. బ్యాంకు డిపాజిట్లుగా రూ.20,000 కోట్లు కల్గివుండగా, రూ.17 వేల కోట్లు రుణం ఉంది. మంగళవారం లక్ష్మి విలాస్ బ్యాంక్ నుండి డబ్బు విత్‌డ్రాపై కేంద్ర ప్రభుత్వం పరిమితి విధించింది.

దీని కింద కస్టమర్లు డిసెంబర్ 16 వరకు బ్యాంకు నుంచి రూ.25 వేలు మాత్రమే ఉపసంహరించుకోగలుగుతారు. ఈ సమాచారాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన ద్వారా ఇచ్చింది. ఆర్‌బిఐ సలహా మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే వైద్య చికిత్స, ఉన్నత విద్య, వివాహం కోసం పరిమితికి మించి డబ్బు కావాలం టే డిపాజిటర్లు రిజర్వ్ బ్యాంక్ అనుమతి తీసుకోవాలి. అనుమతితో రూ.25 వేలకు పైగా ఉపసంహరించుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. అదే సమయంలో గడువు లోపే ఎల్‌విబిని డిబిఎస్ బ్యాంకులో విలీనం ప్రక్రియ పూర్తవుతుందని అడ్మినిస్ట్రేటర్ తెలిపారు. డిబిఎస్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్ తన భారతీయ బ్యాంకులో రూ.2,500 కోట్లు ఖర్చు చేస్తోంది.

విలీనాన్ని వ్యతిరేకిస్తున్న ఎఐబిఒసి

సింగపూర్‌కు చెందిన డిబిఎస్ బ్యాంక్ అనుబంధ సంస్థ తో లక్ష్మి విలాస్ బ్యాంక్ (ఎల్‌విబి)ను విలీనం చేయడం జాతీయ ప్రయోజనానికి సంబంధించినది కాదని ప్రభుత్వరంగ బ్యాంకు అధికారుల సంస్థ ఎఐబిఒసి పేర్కొంది. ప్రైవేటురంగ బ్యాంకు అయిన ఎల్‌విబిని ప్రభుత్వరంగ బ్యాంకులో విలీనం చేయాలని సంస్థ డిమాండ్ చేసింది. ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (ఎఐబిఒ సి) ఈ విషయాన్ని ఆర్‌బిఐకి తెలిపింది. సంస్థ అధ్యక్షుడు సునీల్ కుమార్ మాట్లాడుతూ, నగదు కొరత ఉన్న ఎల్‌విబిని డిబిఎస్ బ్యాంక్ ఇండియాతో విలీనం చేయాలనే ప్రతిపాదన విదేశీ బ్యాంకులు పెద్ద ఎత్తున దేశంలోకి ప్రవేశించడానికి మార్గం కల్పించే కుట్ర అని ఆరోపించారు. దేశీయంగా బ్యాంకింగ్ రంగంలో వృద్ధికి గొప్ప అవకాశా లు ఉన్నాయని ఆయన అన్నారు.

అందుకే విదేశీ బ్యాంకులు ఇక్కడ తమ ఉనికిని పెంచుకోవడానికి చాలా కాలం గా విలీన మార్గాన్ని పరిశీలిస్తున్నాయని అన్నారు. విదేశీ బ్యాంకుల ప్రవేశంతో దుష్ప్రయోజనాలు ఉంటాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్‌బిఐ విలీనం కోసం మంగళవారం విడుదల చేసిన ముసాయిదా ప్రణాళిక ప్రకారం ప్రైవేటు ంగ ఎల్‌విబిని డిబిఎస్ బ్యాంక్ ఇండియా లిమిటెడ్‌లో విలీనం చేసింది. ఎల్‌విబి బ్యాంక్ చాలా పాతదని, స్వాతంత్య్రానికి ముందు నుంచి దేశానికి సేవలు అందిస్తోందని కుమార్ అన్నారు. ఈ బ్యాంకు దేశంలో పిఎస్‌బి లాగా వ్యవహరిస్తోందని, దాని రూపాన్ని నిలబెట్టుకోవాలంటే విదేశీ బ్యాంకుకు బదులుగా ప్రభుత్వరంగ బ్యాంకు లో విలీనం కావాల్సిన అవసరం ఉందని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News