Monday, May 13, 2024

నచ్చేసిందే నచ్చేసిందే…

- Advertisement -
- Advertisement -

Lambasingi movie

సక్సెస్‌ఫుల్ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల సమర్పణలో కాన్సెప్ట్ ఫిలిమ్స్ బ్యానర్‌పై నిర్మాత జికె మోహన్ ఓ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌ని నిర్మిస్తున్నారు. నవీన్ గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బిగ్ బాస్ ఫేమ్ దివి కథానాయికగా కనిపించనుంది. ప్రతిభ గల కొత్త నటులు ఈ చిత్రంలో కనిపించనున్నారు. ఈ చిత్రంతో భరత్ కథానాయకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రానికి ‘లంబసింగి’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ‘ఎ ప్యూర్ లవ్ స్టోరీ’ అనేది ఉపశీర్షిక. ఆర్‌ఆర్ దృవన్ సంగీతం అందించిన ఈ చిత్రం నుండి మొదటి పాట ‘నచ్చేసిందే నచ్చేసిందే’ని ఈనెల 16న చిత్ర యూనిట్ విడుదల చేయనుంది. ఈ పాటకు సంబధించిన ప్రోమోను విడుదల చేశారు. ఈ రొమాంటిక్ మెలోడీని సింగింగ్ సెన్సేషన్ సిద్ శ్రీరామ్ అద్భుతంగా ఆలపించారు. హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News