Saturday, May 11, 2024

తెల్లాపూర్ లో ల్యాండ్ మాఫియా ముఠా అరెస్ట్..

- Advertisement -
- Advertisement -

Ganja Smuggler babu khale arrested in Hyd outskirts

హైదరాబాద్: రామచంద్రాపురం తెల్లాపూర్ లో ల్యాండ్ మాఫియా ముఠాను నగర పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి భూములను కాజేస్తున్న ముఠాను బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంలో మొత్తం 16మందిని నిందితులుగా గుర్తించిన పోలీసులు.. 8మందిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సిపి సజ్జనార్ మాట్లాడుతూ.. అమీర్ పేటకు చెందిన ముఖేష్ అగర్వాల్ ఈ ల్యాండ్ మాఫియాలో ప్రధాన సూత్రధారి. 16మంది గల ఈ ముఠా ఓపెన్ ప్లాట్లను గుర్తించి, నకిలీ డాక్యుమెంట్లను సృష్టిస్తున్నారు. ప్లాట్లను జిపిఎగా తయారు చేసి దందా కొనసాగిస్తున్నారు. నిందితుల నుంచి స్టాంప్ ప్యాడ్స్, నకిలీ ఆధార్, ఓటర్ కార్డులు, 8 సెల్ ఫోన్లు, కారు, కంప్యూటర్ లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

Land Mafia gang arrested in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News