Saturday, May 4, 2024

మనసారా నవ్వడం అన్ని విధాలా ఆరోగ్యదాయకం

- Advertisement -
- Advertisement -

సీపీ శ్వేత

సిద్దిపేట క్రైమ్: మనసారా నవ్వండి: మనసారా నవ్వడం అన్ని విధాలా ఆరోగ్యదాయకమని సీపీ శ్వేత అన్నారు. పోలీసుల ఆరోగ్య పరిరక్షణ గురించి సీపీ ప్రత్యేక శ్రద్ధ కనబరిచి మంత్రి తన్నీరు హరీష్ రావు చొరవతో సిద్దిపేట మెడికల్ కాలేజ్ సహకారంతో పోలీస్ అధికారులకు సిబ్బందికి పోలీస్ హెల్త్ ప్రాజెక్ట్, పోలీస్ ఆరోగ్య రక్ష కార్యక్రమాన్ని చేపట్టి పోలీస్ అధికారులకు సిబ్బందికి 57 రకాల రక్త పరీక్షలు చేయించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ కొంతమంది అధికారులకు , సిబ్బందికి ఊబకాయం, బీపీ, షుగర్, చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు మెడికల్ రిపోర్టులు వచ్చాయని తెలిపారు, మొదట విడత పోలీస్ అధికారులకు సిబ్బందికి మెడికల్ కాలేజ్ డాక్టర్లచే కౌన్సెలింగ్ పూర్తి చేశారు. చికిత్స కూడా అందించడం జరుగుతుందన్నారు. పోలీసుల ఆరోగ్య పరిరక్షణ రెండు సంవత్సరాల పాటు మానిటర్ చేయడంతో బిపి, షుగర్, ఊబకాయం, ఇతర చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలిసిందన్నారు.

నడక – వ్యాయామం: ఉదయం పూట నడక మంచిది. అలా కుదరని పక్షాన సాయంత్రం పూట కూడా నడవచ్చు. నడుస్తూ ప్రకృతి అందాలను తిలకించండి. మంచి స్వచ్ఛమైన గాలిని పీల్చండి. అలాగే వ్యాయామం చేయడం వల్ల శరీరం రిలాక్స్ అవడమే కాకుండా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. చక్కటి నిద్ర: రోజుకు 6 గంటలు తక్కువ కాకుండా నిద్రపోవాలి. నిద్రవల్ల మంచి రిలాక్సేషన్ ఏర్పడుతుంది. మనస్సు, శరీరం చక్కగా ప్రశాంతంగా, ఉత్సాహంగా ఉంటుంది.

సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనండి: సంగీతం, సాహిత్య కార్యక్రమాలు మరి కొంతమందికి స్పోర్ట్స్, గేమ్స్, నృత్యం లాంటి ఇష్టమైన కార్యక్రమాలలో పాల్గొనడం లేదా తిలకించడం చేయడం వల్ల ఒత్తిడికి దూరమవుతారు. అందరి సమస్యలు మీ నెత్తిన వేసుకుంటూ ఉంటే మీరు మానసిక ఒత్తిడికి గురి అవుతారని తెలుసుకోండి. టైమ్ మేనేజ్‌మెంట్ (సమయ పాలన): ఎవరికైనా 24 గంటల సమయమే ఉంటుంది. అయితే కొంతమంది తమకున్న సమయాన్ని వివిధ కార్యక్రమాలకు చక్కగా ఉపయోగించుకుంటారు.

అలా కాలాన్ని సద్వినియోగ పరిచే స్కిల్ మీలో ఉంటే ఒత్తిడిని అధిగమిస్తారని తెలిపారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ అందె శ్రీనివాసరావు, అడిషనల్ డీసీపీ శాంతి భద్రతలు ఎస్. మల్లారెడ్డి, ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్, ఏసీపీలు రమేష్, సతీష్, సురేందర్ రెడ్డి, చంద్రశేఖర్, రవీందర్ రాజు,ఎస్బి ఇన్స్పెక్టర్ రఘుపతి రెడ్డి, సీఐలు, ఇన్స్పెక్టర్లు,రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News