Friday, April 26, 2024

దేవరకద్రలో చిరుతపులి సంచారం

- Advertisement -
- Advertisement -

Leopard wandering in Devarakadra

దేవరకద్ర: మహబూబ్ నగర్ జిల్లాలోని దేవరకద్ర మండలం చౌదరపల్లిలో చిరుతపులి సంచరిస్తోంది. చౌదరపల్లి గుట్టల్లో చిరుతపులి దాడిలో లేగ దూడ మృతి చెందింది. గత మూడ్రోజులుగా దేవరకద్ర మండలంలో చిరుత సంచరిస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు. చిరుత సంచారంతో దేవరకద్ర మండల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మొన్న వెంకటాయపల్లి, నిన్న నాగారంలో చిరుత పశువులపై దాడి చేసింది.

Leopard wandering in Devarakadra

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News