Monday, May 6, 2024

పారిశుధ్య కార్మికులను గౌరవిద్దాం

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: పల్లె ప్రగతి పట్టణ ప్రగతి ద్వారా పల్లెలు, పట్టణాలు పరిశుభ్రంగా ఉండి, ఆరోగ్యకర జీవనానికి దోహదపడుతున్నా యంటే దానికి పారిశుధ్య కార్మికులే మూల కారణమని, వారి జీవితాలు ఉండేలా, ఆరోగ్యంగా ఉండేలా చూడవల్సిన బాధ్యత, గౌరవించే బాధ్యత మనందరిపై ఉందని జిల్లా కలెక్టర్ ఆర్‌వి కర్ణన్ అన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదు రంగాల్లో ప్రతిభను కనబరిచిన తిమ్మాపూర్, చామనపల్లి, గట్టుబూత్కూర్, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన పారిశుధ్య కార్మికులను సన్మానించారు. కరీంనగర్ జిల్లా ఓడీఎఫ్, ఓడీఎఫ్ ప్లస్, ఓడీఎఫ్ ప్లస్ ప్లస్ వంటివి సాధించిందన్నారు. భారతదేశ స్థాయిలో స్వచ్ఛత అవార్డులను సాధించిందంటే పర్యవేక్షిస్తూ ఆదేశాలిచ్చే అధికారులు ఎంతమంది ఉన్న కేవలం సానిటేషన్ వర్కర్ల వల్ల మాత్రమే సాధ్యమవుతుందన్నారు.

ప్రపంచాన్నే గడగడలాడించిన కరోనా కోవిడ్ వైరస్ వ్యాప్తి చెందినప్పుడు అందరు ఇంటి వద్ద నుండే పనులు చేపడితే డాక్టర్లు, సానిటేషన్ వర్కర్లు మాత్రమే క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి సేవలను అందించారన్నారు. సానిటేషన్ వర్కర్ల సేవలను గుర్తించి తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ఇటీవల తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో సఫాయన్న సలామన్న అనే ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా నిర్వహించిందని గుర్తు చేశారు.

భారతదేశంలోనే గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలలో ట్రాక్టర్లు, ట్రాలీలు, స్వీపింగ్ మిషన్లు, సెప్టిక్ ట్యాంక్ క్లీనర్లు ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో శ్రీలత, యూనిసెఫ్ జిల్లా సమన్వయకర్త కిషన్‌స్వామి, యూనిసెఫ్ రాష్ట్ర బాధ్యులు డాక్టర్ వెంకటేశ్, ఫణికుమార్, కాళేశ్వర్, ఆంధ్రప్రదేశ్ నుండి శ్రావ్య, భాను, రమేష్, వేణు, డాక్టర్ సుజాత, కళ్యాణి, తాళ్ల వెంకటేశ్, రవీందర్, గట్టుబూత్కూర్ సర్పంచ్ కంకణాల విజయేందర్‌రెడ్డి, రిసోర్స్ పర్సన్లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News